Asianet News TeluguAsianet News Telugu

పెళ్లైన తొమ్మిదేళ్ల తర్వాత.. భార్య ఆదాయంపై భర్త కన్ను.. కోర్టు షాకింగ్ నిర్ణయం

భార్యను కేవలం డబ్బులు తీసుకువచ్చే కామధేనువుగా  భర్త భావిస్తున్నాడని.. అలాంటి బంధం అవసరం లేదని భావించిన న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు  చేయడం గమనార్హం. భర్త.. తన భార్యపట్ల మానసికంగా క్రూరంగా ప్రవర్తించాడని.. అందుకే విడాకులు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.

Man Viewed Wife As Cash Cow': High Court Grants Divorce To Couple
Author
Hyderabad, First Published Nov 8, 2021, 10:06 AM IST

అతను ఓ తాగుబోతు. కనీసం కుటుంబాన్ని కూడా పట్టించుకోడు. విపరతీంగా మద్యం సావించి.. భార్యను హింసించేవాడు. కనీసం ఆమెను ఓ మనిషిగా కూడా గుర్తించేవాడు కాదు. కానీ.. ఎప్పుడైతే భార్యకు మంచి ఉద్యోగం వచ్చిందో.. అప్పటి నుంచి ఆమె పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టాడు. ఆమె డబ్బుపై అతని కన్నుపడింది. ఆ డబ్బు కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో.. ఆ బాధలు భరించలేక.. బాధితురాలు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: రెయిడ్ కి వచ్చారని రెచ్చిపోయారు.. ఏఎస్ఐ చేతులను తాళ్లతో కట్టేసి.. చితకబాది.. వీరంగం...

కాగా.. భార్యను కేవలం డబ్బులు తీసుకువచ్చే కామధేనువుగా  భర్త భావిస్తున్నాడని.. అలాంటి బంధం అవసరం లేదని భావించిన న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు  చేయడం గమనార్హం. భర్త.. తన భార్యపట్ల మానసికంగా క్రూరంగా ప్రవర్తించాడని.. అందుకే విడాకులు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.

ఆమె పట్ల అప్పటి వరకు ఎలాంటి ప్రేమ చూపించలేదని.. ఎప్పుడైతే భార్యకు ఢిల్లీ పోలీస్ అకాడమీలో ఉద్యోగం సాధించిన తర్వాత.. ఆమె తీసుకువచ్చే జీతం పట్ల సదరు భర్త ఆసక్తి చూపిస్తున్నాడని బాధితురాలు వాపోయింది.

Also Read: నేను హిందువును.. గుడికి వెళ్తే మీకు నొప్పేంటి?.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

బాధితురాలికి దాదాపు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వివాహం అయ్యింది. ఆ సమయంలో ఆమె భర్త వయసు 19 సంవత్సరాలు. కాగా.. వీరి వివాహం 2005లో జరిగింది. అయితే.. కట్నం కావాలంటూ.. ఆమె ను 2014 వరకు కనీసం అత్తారింటికి భర్త తీసుకువెళ్లకపోవడం గమనార్హం. ఆమె పుట్టింట్లోనే ఉండి.. కష్టపడి.. చదివి ఉద్యోగం సంపాదించింది. ఆమె ఉద్యోగం సంపాదించిది అని తెలియగానే.. వచ్చి ఆమెను అత్తారింటికి తీసుకువెళ్లాడు.

Also Read: క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్: ఆర్యన్ అరెస్ట్ పెద్ద కుట్ర.. ముంబై పోలీసులకు అజ్ఞాత వ్యక్తి సమాచారం

ఆమె జీతంతో జల్సాలు చేస్తూ.. కనీసం ఎలాంటి ఉద్యోగం చేయకుండా ... నిత్యం మద్యం సేవించి.. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. నిత్యం వేధింపులు ఎక్కువ అవుతుండంతో.. భరించలేకపోయిన బాధితురాలు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. మొత్తం కేసును పరిశీలించిన న్యాయస్థానం.. విడాకులు ఇవ్వడమే కరెక్ట్ అని భావించింది. దీంతో.. వారికి విడాకులు మంజూరు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios