Asianet News TeluguAsianet News Telugu

నీటిలో మహింద్రా వాహనం.. ఆనందంగా ఉందన్న ఆనంద్ మహీంద్రా


కష్టమర్ ట్వీట్ కి సీఈవో స్పందన

Man tweets a picture of his Mahindra TUV 300 working in 4 ft water; Anand Mahindra responds

ఈ మధ్యకాలంలో దేశంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయమమయ్యాయి. ఇక ఆ రోడ్లపై ప్రయాణించేందుకు ప్రయాణికులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  అయితే.. మహీంద్రా టీయూవీ 300 కారు నడుపుతున్న ఓ వ్యక్తికి మాత్రం ఆ నీటిలో ప్రయాణించడం పెద్ద ఇబ్బందిగా మాత్రం అనిపించలేదట.

4 అడుగుల లోతైన వరద నీటిలో కూడా తన వెహికిల్‌ చాలా బాగా పనిచేస్తుందంటు మహింద్రా టీయూవీ 300 వాహనదారి చెప్పాడు. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రాకు తెలుపుతూ ట్విటర్‌లో దాని ఫోటోను షేర్‌చేశాడు. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహేంద్రా కంట కష్టమర్ ట్వీట్ పడింది. ఇంకేముంది ఆయన చాలా సంబరపడిపోయాడు. అందుకే వెంటనే ఆ కష్టమర్ ట్వీట్ కి సమాధానం కూడా ఇచ్చాడు.

మహింద్రా టీయూవీ 300 వాహనదారి సౌమిత్ర జోషి అనే వ్యక్తి  చేసిన ట్వీట్‌ ఈ విధంగా ఉంది. ‘సర్‌ హ్యాట్సాప్‌. టీయూవీ 300 వాహనం మాకు అందించినందుకు కృతజ్ఞతలు. 4 అడుగుల లోతైన నీటిలో కూడా ఇది డ్రైవ్‌ చేయగలుతుంది’ అని జోషి పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌కు వెంటనే స్పందించిన ఆనంద్‌.. ఇది వినడం నిజంగా ఆనందాయకంగా ఉంది. కానీ సురక్షితంగా ఉండండి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కారు లిమిట్స్‌ పరీక్షించడం అంత మంచిది కాదు. ఇది త్రివిధ దళ వాహనం కాదు’ అని సుతిమెత్తగా హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios