బతుకుతెరువు కోసం ఆమె భర్త వెంట నగరానికి వచ్చింది. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆమె స్నేహంగా దానిని భావించింది. కానీ అతను మాత్రం ఆమెను మరో దృష్టితో చూశాడు. కోరిక తీర్చాలంటూ వేధించాడు. అతనిలోని కామం చివరకు సదరు వివాహితకు,  ఆ వ్యక్తికి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదియమ్మన్ పేట మాదేమంగళం ప్రాంతానికి చెందిన పళణి బెంగళూరులో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు భార్యలు ఉన్నారు. మూడో భార్య సౌమ్యతో కలిసి బెంగళూరులో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మిగిలిన ఇద్దరు భార్యలను స్వగ్రామంలోనే ఉంచేశాడు.

అయితే... కొంత కాలం క్రితం సౌమ్యకి అదే ప్రాంతానికి చెందిన వేలుస్వామి(27) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం సౌమ్య ఇంటికి వెళ్లిన వేలుస్వామి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. 

Also Read స్కార్ఫియోని ఢీకొన్న ట్రాక్టర్... 11మంది మృతి...

దీంతో సౌమ్య అతన్ని బయటకు వెళ్లమని హెచ్చరించింది. అతను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా లైంగిక వేధింపులు చేస్తుండడంతో సౌమ్య విరక్తి చెంది కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో ఆగ్రహానికి గురైన వేలుస్వామి అగ్గిపుల్ల గీసి వేశాడు. 

దీంతో మంటలు అంటుకున్నాయి. అతను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో సౌమ్య మంటలతోనే అతన్ని పట్టుకుంది. దీంతో అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. కేకలు విన్న స్థానికులు తీవ్ర గాయాలతో ఉన్న ఇద్దరిని ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.