స్కార్ఫియోని ట్రాక్టర్ ఢీకొట్టడంతో దాదాపు 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిహార్ జిల్లా లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... శనివారం తెల్లవారుజామున బీహార్ జిల్లా లోని ముజఫర్ పూర్ లోని కంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  

Also Read ట్యూషన్‌కు వచ్చిన బాలికకు ప్రేమ పాఠాలు, లైంగిక దాడి...

స్కార్పియో... ట్రాక్టర్ వాహనాలు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు.  మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.