తనపై దాడిచేసిన దుండగుడిని ఈ మహిళా టెకీ ఏం చేసిందో తెలుసా?

Man tries to strip techie on Bengaluru road
Highlights

దైర్యంగా ఎదురుతిరిగి...దుండగుడి ని పట్టుకుని...

తనపై అకారణంగా దాడికి దిగిన ఓ దుండగుడిని ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దైర్యంగా ఎదుర్కొంది. మద్యం మత్తులోని అతడి దాడి నుండి తప్పించుకుని, పారిపోతున్న అతన్ని వింటాడిమరీ పట్టుకుంది. దుండగుడిని పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. 

నగరంలోని కుండనహళ్లి ప్రాంతంలోని ఓ హాస్టల్లో ఒడిషా రాజధాని భువనేశ్వర్ కు చెందిన ఓ 25 సంవత్సరాల యువతి నివాసముంటోంది. ఈమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఒ ఐటీ కంపెనీలో పని చేస్తోంది. ఈ యువతి నిన్న రాత్రి 9.30 సమయంలో రోడ్డుపై ఒంటరిగా వెళుతోంది. అయితే ఈమె ఒంటరిగా ఉండడాన్ని గమనించిన విజయ్ కుమార్ అనే తాగుబోతు మద్యం మత్తులో ఆమె పై దాడికి దిగాడు. ఆమె టీషర్టును పట్టుకుని లాగుతూ నేలపై పడేశాడు. అయితే హటాత్తుగా జరిగిన ఈ దాడి నుండి యువతి తేరుకునే లోపు నిందితుడు పారిపోతూ కనిపించాడు.

దీంతో అతడిని వెంబడించిన యువతి స్థానికుల సాయంతో పట్టుకుంది. అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించారు.  

 
 

loader