Asianet News TeluguAsianet News Telugu

ఫ్లై ఓవర్ పై నుంచి కట్టల్లో తెచ్చిన డబ్బు వెదజల్లాడు.. అందుకోవడానికి ఎగబడ్డ జనం.. వైరల్ వీడియోలు ఇవే

బెంగళూరులో రద్దీగా ఉండే ప్రాంతంలోని ఓ ఫ్లై ఓవర్ పై నుంచి ఒక వ్యక్తి డబ్బును వెదజల్లాడు. సంచిలో తెచ్చిన నోట్ల కట్టల రబ్బర్ బ్యాండ్లు తొలగించి డబ్బు గాల్లోకి విసిరేశాడు. వీటిని అందుకోవడానికి కింద జనాలు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

man throws cash from flyover in bengaluru, people struggle to collect cash
Author
First Published Jan 24, 2023, 2:41 PM IST

న్యూఢిల్లీ: బతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే అన్నట్టుగా క్యాష్ కనపడిదే కదలనిది ఎవరు? ప్రతి ఒక్కరినీ పరుగులు పెట్టిస్తుంది, ఇష్టం ఉన్నా లేకపోయినా! ఒక వేళ ఆకాశం నుంచి డబ్బు వర్షం జలజల రాలిపడితే ఎవరైనా చూసి మిన్నకుండా ఉంటారా? అందరూ మూకుమ్మడిగా కాసులు అందుకోవడానికి ఎగబడరా? కర్ణాటకలోని బెంగళూరులో ఇదే కనిపించింది. రద్దీగా ఉండే ఫ్లై ఓవర్ పై నుంచి ఓ వ్యక్తి నగదును గాల్లోకి విసిరేసి వెదజల్లాడు. కింద జనాలు ఎగబడి పై నుంచి పడుతున్న నోట్లను అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బెంగళూరులో కేఆర్ మార్కెట్ సమీపంలో ఉన్న ఫ్లై ఓవర్ పైకి ఓ వ్యక్తి సూట్ బూటు ధరించి ఓ వ్యక్తి వచ్చాడు. చేతిలో ఓ గోడ గడియారం పట్టుకుని ఉన్నాడు. అలాగే, ఓ సంచి కూడా ఉన్నది. ఫ్లై ఓవర్ పైనకు వెళ్లి సంచిలో నుంచి నోట్ల కట్టలు తీశాడు. నోట్ల కట్టకు ఉన్న రబ్బర్ బ్యాండ్‌లను తొలగించి వెదజల్లాడు. దీంతో ఫ్లై ఓవర్ పై, కింద కూడా కొంత కాలం ట్రాఫిక్ జామ్ అయింది. ఫ్లై ఓవర్ పై అతడి వెంట పలువురు వాహన చోదకులు పడ్డారు. డబ్బు తమకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: యువకుడితో అర్థనగ్న నృత్యాలు.. ఒళ్లంతా తడుముతూ, చెంపలు తాకుతూ ఓ రౌడీషీటర్ పైశాచికానందం.. వీడియో వైరల్..

కానీ, అతను కాలి నడకనే మరో చోటికి మారుతూ కిందకు డబ్బు గుమ్మరిస్తూనే ఉన్నాడు. కొన్ని డబ్బులు ఫ్లై ఓవర పైనా వేశాడు. కింద మాత్రం రద్దీగా ఉండే మార్కెట్‌లో జనాలు పై నుంచి పడుతున్న డబ్బును ఏరుకోవడంలో మునిగిపోయారు. ఈ వీడియోలను ఓ వాహనంలో అక్కడికి చేరుకున్న వ్యక్తి తీశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతున్నది.

అతను ఎవరు? ఎందుకు డబ్బు వెదజల్లాడు? అనే విషయాలపై స్పష్టత లేదు. పోలీసు బృందం అక్కడికి చేరుకునే లోపు అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. అతను వెదజల్లిన డబ్బు మొత్తం కూడా పది రూపాయల నోట్ల డినామినేషనే కావడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios