బాలికతో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై ఓ వ్యక్తి పట్ల స్థానికులు అమానవీయంగా ప్రవర్తించారు. రద్దీగా వుండే రోడ్డుపై యువకుడికి దేహశుద్ధి చేసి.. నగ్నంగా ఊరేగించారు. కర్ణాటక (karnataka) రాష్ట్రం హసన్ జిల్లాలోని (hassan) మహారాజా పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

బాలికతో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై ఓ వ్యక్తి పట్ల స్థానికులు అమానవీయంగా ప్రవర్తించారు. రద్దీగా వుండే రోడ్డుపై యువకుడికి దేహశుద్ధి చేసి.. నగ్నంగా ఊరేగించారు. కర్ణాటక (karnataka) రాష్ట్రం హసన్ జిల్లాలోని (hassan) మహారాజా పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాధితుడిని విజయపుర జిల్లాకు చెందిన మేఘరాజ్‌గా గుర్తించారు. ఇతను హాసన్ నగరంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో మేఘరాజ్.. పార్క్‌లో సేదతీరుతూ బాలికను వేధిస్తుండగా స్థానికులు గమనించారు. దీంతో అతనిని పట్టుకుని దేహశుద్ది చేశారు. ఈ నేరంపై పోలీసులకు అప్పగించడానికి బదులు .. అతనిని కొట్టడమే కాకుండా, రద్దీగా వుండే హేమావతి విగ్రహం సర్కిల్ వద్ద అతనిని నగ్నంగా ఊరేగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల నుంచి యువకుడిని రక్షించి పీఎస్‌కు తరలించారు. అలాగే యువకుడిపై దాడి చేసి, నగ్నంగా ఊరేగించినందుకు గాను ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

మరోవైపు పలువురు స్థానికులు చేసిన ఆరోపణలకు సంబంధించి బాధిత బాలిక పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అయితే మేఘరాజ్ మాత్రం.. తనను దారుణంగా కొట్టి, నగ్నంగా ఊరేగించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.