కరోనా భయంతో ఆసుపత్రి భవనంపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య
కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఢిల్లీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చికిత్స పొందుతున్న ఐసోలేషన్ వార్డు బ్లాక్ నుండి కిందకు దూకి ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఢిల్లీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చికిత్స పొందుతున్న ఐసోలేషన్ వార్డు బ్లాక్ నుండి కిందకు దూకి ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఢిల్లీ ఇందిరాగాంంధీ ఎయిర్ పోర్టులో ఓ 35 ఏళ్ల వ్యక్తిని కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఓ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బుధవారం నాడు రాత్రి 9 గంటల సమయంలో ఆయనను ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచారు.
Also read:సెలవులు రద్దు, ఆరు కరోనా పాజిటివ్ కేసులు: ఈటల రాజేందర్
అతని నుండి రక్తపు నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. రక్తపు నమూనాల రిపోర్టు కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు. ఈ రిపోర్టులు రాకముందే అతను ఆసుపత్రి 7వ అంతస్తు నుండి కిందకు దూకాడు.
తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తి చాలా కాలంగా అస్ట్రేలియా రాజధాని సిడ్నీలో నివాసం ఉంటున్నాడు. అతను సిడ్నీ నుండి ఇండియాకు రావడంతో అధికారులు పరీక్షల కోసం ఐసోలేషన్ వార్డుకు తరలించారు.