నిత్యం రద్దీగా ఉండే ముంబైలోని మలాద్ రైల్వేస్టేషన్‌లో ఒక వ్యక్తి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 35 ఏళ్లున్న ఓ వ్యక్తి స్టేషన్ ఆవరణలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి చాలా ప్రశాంతంగా ఫ్లాట్ ఫాం పైకి చేరుకున్నాడు. అతనిని చూసిన ఎవ్వరూ కూడా క్షణాల్లో అఘాయిత్యానికి పాల్పడతాడని అనుకోలేరు కూడా..

ప్రయాణికులంతా ఎవరి పనుల్లో వారుండగా.. రైలు రాకను గమనించిన ఆ వ్యక్తి.. రైలు పట్టాల వైపు రెండడుగులు ముందు కేసి.. ట్రైన్‌ వైపుకు కదిలాడు.. రైలు ఇంజిన్‌ బలంగా తాకడంతో పాటు కిందపడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.. అక్కడ ఇంత జరిగిన ఫ్లాట్ ఫాం మీదున్న ఎవ్వరికి  తెలియకపోవడం గమనార్హం. స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తుండగా ఘోరం గురించి తెలిసింది. కాగా, మృతుని వివరాలు ఇంతవరకూ తెలియరాలేదు.

 

"