పీరియడ్స్ లో ఉన్న మహిళలకు యువకుడి సన్మానం..వీడియో వైరల్..!
ఓ యువకుడు ఓ పబ్లిక్ ప్లేస్ లో తన బ్యాండ్ తో కలిసి ఓ చిన్నపాటి మ్యూజిక్ కన్సర్ట్ లాగా ఏర్పాటు చేసుకున్నాడు. పక్కనే ఓ కుర్చీని ఖాళీగా ఉంచాడు. అది పీరియడ్స్ లో ఉన్న మహిళల కోసం అని స్పెషల్ గా నోట్ రాసి ఉంచాడు.

మహిళలకు పీరియడ్స్ ప్రతినెలా వస్తూనే ఉంటాయి. వచ్చిన ప్రతిసారీ భరించలేని నొప్పి వారిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే, పీరియడ్స్ లోనూ వారు అన్ని పనులు చేసుకుంటూ వెళ్లిపోతూ ఉంటారు. అయితే, ఓ యువకుడు మాత్రం పీరియడ్స్ లో ఉన్న మహిళల కోసం స్పెషల్ గా ఒకటి చేయాలని అనుకున్నాడు. దాని కోసం ఓ పబ్లిక్ ప్లేస్ లో అతను చేసిన పనికి ఇప్పుడు అందరూ ఫిదా అయిపోతున్నారు.
ఇంతకీ అతను ఏం చేశాడంటే. ఇది ఎక్కడ జరిగింది అనేది తెలీదు కానీ, మన దేశంలో అని మాత్రం హామీ ఇవ్వగలం. ఓ యువకుడు ఓ పబ్లిక్ ప్లేస్ లో తన బ్యాండ్ తో కలిసి ఓ చిన్నపాటి మ్యూజిక్ కన్సర్ట్ లాగా ఏర్పాటు చేసుకున్నాడు. పక్కనే ఓ కుర్చీని ఖాళీగా ఉంచాడు. అది పీరియడ్స్ లో ఉన్న మహిళల కోసం అని స్పెషల్ గా నోట్ రాసి ఉంచాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అటుగా వెళ్తున్న మహిళల్లో ఎవరైనా పీరియడ్స్ లో ఉంటే ఆ కుర్చీలో కూర్చోవచ్చు. చాలా మంది మహిళలు అతను కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు. అలా కూర్చున్న మహిళలకు అతను సన్మానం చేయడం మొదలుపెట్టాడు. వారిని పూలతో సన్మానం చేశాడు. అనంతరం వారికి కేక్ ఇచ్చాడు. తర్వాత వారికి చిన్న పూల బొకేలు, చిన్నపాటి బహుమతులు కూడా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.
అక్కడితో ఆగలేదు, వారి కోసం స్వయంగా పాట కూడా పాడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకి 8 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. కామెంట్స్ అయితే, కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఎక్కువ మంది మహిళలు ఈ వీడియోకి రెస్పాండ్ అవుతుండటం విశేషం.