Asianet News TeluguAsianet News Telugu

ఆ బిచ్చగాడు ఐదు కోట్లకు అధిపతి.. కానీ రోడ్లమీద బిచ్చం ఎత్తుకుంటూ.. ఫుట్ పాత్ పై జీవిస్తూ..

లండన్ లో ఓ బిచ్చగాడి గురించి తెలిస్తే షాక్ అవుతారు? అతను ఐదుకోట్ల ఆస్తికి ఓనర్. కానీ మత్తులో తూగుతూ.. బిచ్చం ఎత్తుకుంటూ.. రోడ్ల మీద జీవిస్తాడు. ఎందుకంటే... 

beggar owner of five crores property, But begging on the roads..reason here
Author
First Published Dec 3, 2022, 9:02 AM IST

లండన్ : బిచ్చగాడు సినిమా చూశారా?.. అందులో హీరో కోటీశ్వరుడైనా కూడా  గుడి మెట్లమీద బిచ్చం అడుక్కొని జీవిస్తుంటాడు. సినిమా చూసిన వారికి అతను ఎందుకు అలా చేస్తాడో తెలిసిపోతుంది. అయితే అచ్చం ఇలాంటి స్టొరీనే లండన్లోని ఓ వ్యక్తిది. అతను దాదాపు ఐదు కోట్లకు అధిపతి. కానీ రోడ్ల మీద బిచ్చమెత్తుకుంటాడు. రాత్రిపూట ఫుట్ పాత్ లపైనే పడుకుంటాడు. అతను కూడా ఏదైనా దీక్ష తీసుకున్నాడేమో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అతనికి నెలకు  ఇంటి కిరాయి రూపంలో దాదాపు  రూ.1.27 లక్షల వరకు వస్తాయి.  అయినా కూడా తన బెగ్గర్ జీవితాన్ని వదులుకోవడం లేదు. 

ఇంతకీ అతని పేరేంటంటే డోమ్. లండన్ నివాసి. అతని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అతను చేస్తున్నదంతా వ్రతం కాదు డ్రగ్స్  కోసం అని తెలిస్తే  ముక్కున వేలేసుకుంటారు. వివరాల్లోకి వెళితే.. డోమ్ లండన్లోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. అథ్లెటిక్స్లో చాలా చురుగ్గా ఉండేవాడు. కానీ అతనికి చదువు అబ్బలేదు. అథ్లెటిక్స్ వల్ల అతనికి స్కాలర్ షిప్ వచ్చేది. ఆ డబ్బులతో  జులాయిగా తిరుగుతూ, జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. 

దీంతో 13 ఏళ్లు వచ్చేసరికే స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ లాంటి వాటికి బానిసయ్యాడు. 17 ఏళ్లకే  హెరాయిన్ కు అలవాటు పడ్డాడు. మరో మూడేళ్లు గడిచేసరికి… అతనికి లేని అలవాటు లేదు అన్నంతగా తయారయ్యాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. డోమ్ ను ఎలా మార్చాలో వారికి అర్థం కాలేదు. పెళ్లయితే మారతాడేమో అని అనుకున్నారు. డోమ్ కు పెళ్లి చేశారు. ఆ తర్వాత కొంతకాలం వ్యసనాలకు దూరంగా ఉండడానికి డోమ్   ప్రయత్నించాడు. కానీ అతనికి సాధ్యం కాలేదు.

అక్కడ పెళ్లి కంటే ముందు శృంగారం నేరం.. కొత్త క్రిమినల్ కోడ్

అది తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేసింది. అతని భవిష్యత్తు గురించి భయపడేలా చేసింది. దీంతో అతడికి ఒక ఇల్లు కొని ఇచ్చారు.  తాము సంపాదించిన ఆస్తులు అన్నీ పోయినా అతడు ఉండడానికి ఇల్లు ఉంటుందని ఆలోచించారు. అయితే డోమ్ మాత్రం ఆ ఇంట్లో ఉండటం లేదు. దానికి కిరాయికి ఇచ్చాడు. దాని ద్వారా వచ్చే  ఆదాయంతో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు. అద్దె కూడా సరిపోకపోవడంతో.. రోడ్లమీద బిచ్చమెత్తుకుంటున్నాడు. అలా భిక్షాటనతో రోజుకు 200 నుంచి 300 పౌండ్లు సంపాదిస్తున్నాడు. వాటితో.. డ్రగ్స్ కొనుక్కొని రోజంతా మత్తులోనే ఊగుతూ ఉంటాడు.

డ్రగ్స్ మత్తులో ఏదో రోడ్డు పక్కన పడుకుండిపోవడం.. తెలివిలోకి వచ్చిన తర్వాత భిక్షంఎత్తుకోవడం.. ఇది అతని డైలీ రొటీన్. ఎంత చేసిన అతను మారకపోవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు ఎవరూ కూడా అతని పట్టించుకోవడం మానేశారు. అయితే, ఐదు కోట్ల విలువైన ఇల్లు ఉన్న తాను ఇలా బిచ్చమెత్తు కోవడం.. రోడ్లమీద బిచ్చం పడుకోవడం డోమ్ కు ఈమధ్య నచ్చడం లేదట. మారిపోయి.. డ్రగ్స్ కు దూరంగా ఉందామని, సాధారణ జీవితం గడుపుతామని అనుకుంటున్నాడట. 

Follow Us:
Download App:
  • android
  • ios