Asianet News TeluguAsianet News Telugu

దుస్తులు విప్పించి కొట్టారు, చిత్రహింసలు పెట్టారు.. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి ఆవేదన..

ప్రభుత్వానికి వ్యతిరేక వీడియోలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఓ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనను వారు చిత్ర హింసలు పెట్టారంటూ అతను జడ్జి ఎదుట కన్నీటిపర్యంతమయ్యాడు. 

Undressed beaten and tortured YouTube channel owner to judge in andhrapradesh
Author
First Published Aug 27, 2022, 7:26 AM IST

అమరావతి : వైసిపి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ, పరిపాలనలో తప్పిదాన్ని ఎత్తిచూపుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేసే ‘ఘర్షణ’ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు బొబ్బూరి వెంగళరావు (34)ను సిఐడి అధికారులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. ప్రజల్లో వర్గ వైషమ్యాలు ప్రేరేపిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని.. అంతమొందిస్తానంటూ బెదిరిస్తున్నారని…నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపణలతో ఐపీసీలోని సెక్షన్ 153ఏ, 505(2), 506, 386,120బీ, ఐటీ చట్టంలోని 67ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన విజయవాడ నుంచి హైదరాబాదుకు బస్సులో వెళ్తుండగా తెలంగాణలోని కోదాడ వద్ద గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకువచ్చారు. 

ఉదయం నుంచి సాయంత్రం వరకు వెంగళరావు సిఐడి అధికారులు అదుపులోనే ఉన్నారు. ‘సిఐడి పోలీసులు నన్ను దుస్తులు విప్పి తీవ్రంగా కొట్టారు. ఈ ఈ విషయాన్ని మీతో చెబితే నా రెండేళ్ల కుమారుడిని చంపేస్తామంటూ బెదిరించారు’ అన్ని వెంగళరావు న్యాయమూర్తిగా కన్నీటిపర్యంతమయ్యారు. అధికారులు శుక్రవారం రాత్రి ఆయనను గుంటూరు ఆరో అదనపు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. విచారణ పేరిట సిఐడి పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారంటూ వెంగళరావు..  న్యాయమూర్తికి వివరించగా.. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.  ఆ వివరాలు…

కుప్పంలో చంద్రబాబుది దౌర్జన్యమే.. మీ యాక్షన్‌కి మా రియాక్షన్ తప్పదు : అంబటి రాంబాబు హెచ్చరిక

చిత్రహింసలు పెట్టారు…
‘నా రెండు చేతులూ పైకి పెట్టి.. వాటి మధ్యలో కర్ర పెట్టి..  అరికాళ్లపై కొట్టారు. బల్లపై పడుకోబెట్టి, నా నడుముపై కూర్చుని, కాళ్లు పైకిఎత్తి కొట్టారు.  ఒక కర్రతో నా వృషణాల్లో పొడిచే ప్రయత్నం చేసి బయటపెట్టారు. ‘ఎంపీ రఘురామ కృష్ణరాజును కొడితేనే దిక్కులేదు. నిన్ను కొడితే కోర్టులు ఏం చేయగలవు? నిన్ను కొట్టిన విషయం న్యాయమూర్తితో చెబితే  నువ్వు బయటకి వచ్చాక.. నిన్ను చంపేసినా కూడా కోర్టులు ఏమి చేయలేవు. మేము చెప్పినట్లు వింటేనే బతుకుతావు. లేదంటే నువ్వు , నీ కుటుంబం మిగలదు’ అని బెదిరించి, కొట్టి, నాతో ఓ కాగితంపై సంతకాలు చేయించుకున్నారు. ఆ కాగితంలో ఉన్న విషయాలు ఏవి నిజాలు కాదు.

మరోసారి వీడియోలు చేస్తే చంపేస్తాం…
‘యూట్యూబ్ వీడియో లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు ఇంకోసారి మాట్లాడితే చంపేస్తాం. కావాలనుకుంటే వైసిపికి అనుకూలంగా వీడియోలు చేసుకో. లేదంటే నువ్వు ఎక్కడున్నా నిన్ను, మీ కుటుంబాన్ని చంపేస్తాం’  సిఐడి అధికారులు నన్ను బెదిరించారు. ‘నేను కొట్టమని నువ్వు బయటకు చెప్పినా ఎవరూ నమ్మరు. నీకు ఒంటిపై గాయాలు. అదే మా టాలెంట్’  అని అన్నారు. ‘నాకు భార్య,  రెండేళ్ల కుమారుడు, 60 ఏళ్ల పైబడిన తల్లిదండ్రులు ఉన్నారు. నన్ను చంపేస్తే, నా కుటుంబం రోడ్డున పడుతుంది’ అని వెంగళరావు వాపోయారు.

కొట్టామని చెపితే బెయిల్ రాదు..
‘నేను కొట్టామని న్యాయమూర్తితో చెబితే నీకు బెయిల్ రాదు. కొట్టలేదని చెబితేనే బెయిల్ వస్తుంది. నెల రోజుల కిందట వెంకటేష్ అనే వ్యక్తి తనను సిఐడి అధికారులు కొట్టారని న్యాయమూర్తితో చెప్పారు. అతనికి రెండు నెలలు బెయిల్ రాలేదు. నీకు అదే పరిస్థితి వస్తుంది’ అంటూ సిఐడి అధికారులు తనను బెదిరించారని వెంగళరావు వాంగ్మూలం ఇచ్చారు. శుక్రవారం రాత్రి సిఐడి పోలీసులు వెంగళరావు ప్రాథమిక వైద్య పరీక్షలు జరిపించి, మెజిస్ట్రేట్ శృతి ఇంటి వద్ద హాజరు పరిచారు. పోలీసులు కొట్టడంతో తన ఒంటికి గాయాలయ్యాయని ఆయన చూపించడంతో న్యాయమూర్తి తిరిగి వైద్య పరీక్షలకు ఆదేశించారు. మెజిస్ట్రేట్ ఆదేశాలతో వెంగళరావును 11.55 గంటలకు జిజిహెచ్ కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. శనివారం ఉదయం వైద్యులు పరీక్షలు చేసి, నివేదికను సీల్డ్ కవర్లో జడ్జికి అందజేస్తారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios