ప్రేమించి పెళ్లి చేసుకుని భార్య మీద చిత్రహింసలకు పాల్పడుతున్నాడో వ్యక్తి. పిల్లలు వద్దంటూ అబార్షన్లు చేయించాడు, అశ్లీల వీడియోలు చూపిస్తూ.. సిగరెట్లతో కాలుస్తూ.. స్నేహితుల ముందు అవమానిస్తూ హింసించాడు.
బెంగళూరు : బెంగళూరులో ఓ భర్త దారుణానికి తెగించాడు. భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ వేధించాడు. అంతటితో ఆగకుండా ఆమెకు సిగరెట్టుతో వాతలు పెడుతూ.. చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో అతనిమీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సదరు భర్త పేరు ప్రదీప్. ఆ వ్యక్తిని బాణసవాడి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ప్రదీప్.. ఆ యువతి ప్రేమించుకున్నారు. ఐదేళ్ల కిందట ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తరువాత పిల్లలు వద్దంటూ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. ఆ తరువాత ఏమయ్యిందో తెలీదు కానీ ఉన్మాదిగా మారాడు. గత ఐదు నెలలుగా ఆమెకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ.. అలా చేయాలంటూ టార్చర్ పెడుతున్నాడు. సిగరెట్లతో కాలుస్తూ హింసిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందింది.
అతను అంతటితో ఆగలేదు. తన స్నేహితులను ఇంటికి పిలిచే వాడు. వారి ముందు ఆమెను అవమానించేవాడు. అలాగే నిత్యం జరుగుతుండడంతో భరించలేక ఆ యువతి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అలా వెళ్లినా అతను ఆమెను వదలలేదు. పుట్టింటికీ వచ్చి.. అక్కడా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో కుటుంబసభ్యులకు విషయం అర్థమయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తున్నామని తెలిపారు.
‘చిలుక కనబడటం లేదు’.. ఆచూకీ చెబితే రూ.50 వేలు నజరానా.. !
ఇదిలా ఉంటే, కర్ణాటకలో ఓ ప్రేమజంట.. తమ ప్రేమను పెద్దలు భగ్నం చేశారని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాప్రయత్నం చేసింది. వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. ఉత్తర కన్నడ జిల్లా హళియాళలో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే..హళియాళకు చెందిన జ్యోతి అంత్రోళకర (19), రికేష్ సురేష్ మిరాశి (20)లు హళియాళ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. కాలేజీలో పెరిగిన పరిచయంతో వీరిద్దరూ ప్రేమించుకున్నారు.
అయితే, నెల రోజుల కిందట తల్లిదండ్రులు జ్యోతికి మరో యువకునితో వివాహం చేశారు. కానీ, పెళ్లి అయినప్పటికీ ప్రియుడిని జ్యోతి మరిచిపోలేదు. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన ప్రేమికులు.. తాము ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 15వ తేదీన ముందగోడు రోడ్డులో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చారు. నాలుగు రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాడి మంగళవారం వీరు మరణించారు. ఈ మేరకు హళియాళ పోలీసులు కేసు నమోదు చేశారు.
