కరోనాతో ఓ పక్క దేశం అల్లాడిపోతోంది. కామాంధులు తమ కామవాంఛలు తీర్చుకోవడానికి చిన్నారులు, బాలురను సైతం వదిలిపెట్టడం లేదు. తాజాగా ఓ వ్యక్తి మైనర్ బాలుడిపై అసహజ అత్యాచారానికి పాల్పడటమే కాకుండా అతనిని బతికుండగానే కాల్చివేయడానికి ప్రయత్నించాడు.

వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగలో సల్మాన్ అనే యువకుడు బుధవారం మధ్యాహ్నం ఓ పదేళ్ల బాలుడిని ఆడుకుందామని పిలిచాడు. అతని మాటలు నమ్మిన బాలుడు, యువకుడితో పాటు వెళ్లాడు.

Also Read:సోదరుడిని బావిలోకి తోసేసి యువతిపై ఏడుగురు గ్యాంగ్ రేప్

అనంతరం ఆ బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఆ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో భయపడిపోయిన బాలుడు రక్షించాలంటూ పెద్దగా కేకలు వేశాడు.

స్థానికులు వస్తారేమోనని కంగారుపడిన యువకుడు బాలుడి గొంతు నులుముతూ అత్యాచారం చేయడంతో చిన్నారి అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయాడు. బాలుడు చనిపోయాడని భావించిన నిందితుడు అతనిని తగులబెట్టాలని భావించారు. వెంటనే బాలుడిని సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి శరీరానికి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు.

Also Read:దారుణం:ఆస్తి కోసం ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య

స్పృహలోకి వచ్చిన ఆ బాలుడు సాయం కోసం కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితుడిని అరెస్ట్ చేశారు.