Asianet News TeluguAsianet News Telugu

కూతురిపై అత్యాచారం, గర్బానికి కారణం.. కీచక తండ్రికి 31 జైలుశిక్ష...

కూతురిమీద అత్యాచారం చేసి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన ఓ కీచకుడైన తండ్రికి కేరళ కోర్టు 31 యేళ్ల కారాగారశిక్ష విధించింది. ఈమేరకు శుక్రవారం తీర్పునిచ్చింది. 

man sentences 31-year imprisonment for raping and impregnant daughter in Kerala
Author
First Published Dec 24, 2022, 10:15 AM IST

కేరళ : 2016లో తన కూతురిపై అత్యాచారం చేసి.. ఆమె గర్భం దాల్చడానికి కారణం అయిన కేసులో కేరళకు చెందిన ఓ వ్యక్తికి శుక్రవారం 31 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే, ఈ కేసులో తరువాతి సమయంలో విచారణ కాలంలో.. బాధితురాలు, ఆమె తల్లితో సహా చాల మంది ముఖ్యమైన సాక్షులు.. నిందితుడికి అనుకూలంగా వాంగ్మూలాలు ఇచ్చారు. అతను తమను పోషించే ఏకైక ఆధారమని అతను జైలుకు వెడితే తమ పరిస్థితి ఏంటని వీరు వాదించారు. అయితే కోర్టు మాత్రం.. దీనిని ఒప్పుకోలేదు. 

దీంతో కేసు నీరుగారిపోకుండా.. గర్భస్రావం చేయబడిన పిండం నుండి తీసిన డీఎన్ఏ శాంపిల్ ఆధారాల ఆధారంగా ఫాస్ట్ ట్రాక్ జడ్జి టీజీ వర్గీస్ సదరు వ్యక్తిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించారు.గర్భస్రావం చేయబడిన పిండం నుండి సేకరించిన నమూనా నిందితుడి రక్త నమూనాతో సరిపోలడంతో అతను పిండానికి తండ్రి అని సూచించినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షిజో మోన్ జోసెఫ్ తెలిపారు. తండ్రి తన సొంత కూతురిపై అత్యాచారం చేసి, గర్భం దాల్చేలా చేయడం అత్యంత హేయమైన చర్య అని, నిందితుడు ఎలాంటి దయకు అర్హుడు కాదని కోర్టు పేర్కొంది.

ఢిల్లీలో అడుగు పెట్టిన రాహుల్ భారత్ జోడో యాత్ర.. పార్టీ శ్రేణుల ఘన స్వాగతం..

బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టం కింద వివిధ నేరాలకు సంబంధించి నిందితుడికి 31 ఏళ్ల జైలు శిక్ష విధించబడినప్పటికీ, అతను కేవలం 10 సంవత్సరాలు మాత్రమే శిక్ష అనుభవిస్తున్నాడు, ఇది అతనికి విధించిన వివిధ రకాల శిక్షల్లో అత్యధికం, ప్రాసిక్యూటర్ అన్నారు.

కోర్టు ఆ వ్యక్తికి రూ. 75,000 జరిమానా విధించింది. ఆమె పునరావాసం కోసం బాలికకు రూ. 50,000 చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది. 2016లో ఇడుక్కి జిల్లా కొన్నతడి గ్రామంలోని తమ ఇంట్లో తన కుమార్తెపై (అప్పటికి 14 ఏళ్లు) రాత్రి సమయంలో వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఎస్పీపీ తెలిపారు. బాధితురాలు, ఆమె సోదరుడు, ఆమె తల్లిదండ్రులు కలిసి జీవించేదని ఎస్పీపీ తెలిపారు.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపును కాపాడేందుకు ఆమె వివరాలు వెల్లడించలేదు)

Follow Us:
Download App:
  • android
  • ios