Asianet News TeluguAsianet News Telugu

భార్య మైనర్ గా ఉన్నప్పుడు అత్యాచారం.. భర్తకు 20యేళ్ల జైలుశిక్ష.. కానీ ట్విస్టేంటంటే...

ఓ మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడో వ్యక్తి. తరువాత ఆమె మేజర్ అయ్యాక పెళ్లి చేసుకున్నాడు. అయితే, అత్యాచారం చేసిన సమయంలో పెట్టిన కేసులో ఇప్పుడు అతడికి 20యేళ్ల జైలుశిక్ష పడింది. 

man sentenced jail for 20years over molestation on minor,  now his wife in Odisha
Author
First Published Nov 3, 2022, 7:28 AM IST

ఒడిశా : వివాహం జరగక ముందు మైనర్ గా ఉన్న భార్యపై అత్యాచారం చేసినందుకు ఓ వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. దోషిగా తేలిన అతడికి రూ. పది వేలు జరిమానా సైతం విధించింది కోర్టు. ఒడిశాలోని అనుగుల్ జిల్లాకు చెందిన గోవర్ధన్ నాయక్… బనర్పల్ ప్రాంతానికి చెందిన మైనర్ మీద 2016లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక 2021 జనవరిలో తన తల్లిదండ్రులతో కలిసి గోవర్ధన్ మీద కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో గోవర్థన్ నాయక్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. 

ఆ తరువాత పోలీసులు అతడిని జైలుకు పంపారు. బెయిల్ పై బయటకు వచ్చిన అతను గత సంవత్సరం జూలైలో మేజర్ అయిన బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడు. అయితే తాజాగా కేసు విచారణ పూర్తి కాగా జిల్లా కోర్టు న్యాయమూర్తి.. గోవర్థన్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాధితురాలు మాత్రం తన భర్తను వెనకేసుకొచ్చింది.  ‘కుటుంబ సభ్యుల ఒత్తిడితో నా భర్త మీద కేసు పెట్టాను. అందుకు అతను జైలుకు వెళ్లాడు. నా భర్త మళ్లీ నా జీవితం లోకి రావాలి. అతడు అమాయకడు’ అని చెప్పుకొచ్చింది. 

ఢిల్లీ గ్యాస్‌ చాంబర్‌గా మారింది - పంజాబ్‌ ఆప్‌ ప్రభుత్వంపై మండిపడ్డ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్

ఇదిలా ఉండగా, అక్టోబర్ 18న విశాకపట్నంలో ఇలాంటి కేసులోనే ఓ తీర్పు వెలువడింది. మునిమనవరాలి వయసున్న ఓ బాలికపై అత్యంత హేయమైన పనికి దిగజారాడో నీచుడు. తమను నమ్మి ఇంట్లో ఉంచి వెడితే తొమ్మిదేళ్ల బాలిక మీద రెండుసార్లు అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడైన 74 ఏళ్ల వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ విశాఖ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి కె. రామ శ్రీనివాసరావు సోమవారం తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. బాధితురాలికి రూ. 4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. 

పోక్సో న్యాయస్థానం  ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. అరిలోవ ప్రాంతానికి చెందిన  బాలిక (9) మూడో తరగతి చదువుతోంది. బాలిక తల్లి ఓ దుకాణంలో పనిచేసేది. రోజూ తన కుమార్తెను స్కూలు విడిచిన తరువాత అరిలోవ దుర్గా బజార్ ప్రాంతంలోని స్నేహితురాలు ఇంటివద్ద ఉంచేది. స్నేహితురాలి బంధువు  బాలయోగి (74) అక్కడే ఉండేవాడు. ఈ ఏడాది మార్చి 23న  బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లి, ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్ళింది. 

అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక ఇన్ఫెక్షన్తో బాధపడుతుందని తెలిపారు. దీనిపై బాలికను ప్రశ్నించడంతో బాలయోగి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానంలో హాజరు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధించారు. అభం, శుభం తెలియని చిన్నారుల మీద ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ దర్జాగా తిరిగేస్తున్న నిందితులు ఇంకా చాలామందే ఉంటున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా అత్యంత జాగురూకతతతో ఉండాలి. 

ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి జీవితకాలం కఠిన కారాగారశిక్ష విధిస్తూ.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కోర్టు న్యాయమూర్తి రజిని సోమవారం తీర్పునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నున్నకి చెందిన బాలిక (7) ఈ ఏడాది ఫిబ్రవరి 24న స్కూలుకు వెళ్లి వచ్చి ఇంటి వద్ద ఉంది. ఆసమయంలోనే ఆ ఇంటి సమీపంలో ఉంటున్న అనిల్ (30) ఆ బాలికకు నెమలీ ఈకలు ఇస్తానని ఆశ చూపి తాను పనిచేస్తున్న టెంట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అనిల్ చేసిన పనిని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె నున్న  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసు నమోదు చేసి.. కేసును దిశా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. దిశా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి పై విధంగా మరణించేవరకు జైలులో ఉండాలని కఠిన కారాగార శిక్ష, రూ. మూడు వేల జరిమానా విధించారు. బాలిక  కుటుంబానికి రూ. ఐదు లక్షల నష్టపరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ను ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios