పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాలోని స్థానిక కోర్టు గురువారం చైల్డ్ పోర్నోగ్రఫీ, లైంగిక వేధింపుల కేసులో ఒక వ్యక్తికి 20 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.

పశ్చిమ బెంగాల్‌ : చైల్డ్ పోర్నోగ్రఫీ, లైంగిక వేధింపుల కేసులో పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లా, స్థానిక కోర్టు గురువారం నిందితుడికి 20 యేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు తర్వాత, కేసుప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, బివాస్ ఛటర్జీ మాట్లాడుతూ మొత్తం పశ్చిమ బెంగాల్‌లో పిల్లల అశ్లీలత కేసుల్లో.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్ 67B కింద శిక్షపడిన మొదటి కేసుగా, అతడిని మొదటి దోషిగా పేర్కొన్నారు.

నిందితుడు, బిజోయ్ రాయ్, మొదట 16 యేళ్ల బాలికను ఆమె ట్యూషన్ క్లాస్ బయట కలిశాడు. ఆ తరువాత ఆమెతో స్నేహం చేశాడు. తర్వాత అతను బాలికపై అత్యాచారం చేశాడు. ఆమెకు డ్రింక్ తాగించి.. ఆ తరువాత ఆమె అసభ్యకరమైన ఫోటోలను కూడా క్లిక్ చేశాడు. రాయ్ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి, సహకరించకుంటే ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. అలా బాలిక నుంచి రూ.5 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు.

రాహుల్ గాంధీ పెళ్లి ప్రతిపాదనకు ఆమోదం లభించింది -విపక్షాల పాట్నా సమావేశంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సెటైర్

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనేక పథకాల నుండి పొందిన నిధుల నుండి ఆదా చేసిన 12,000 రూపాయలను బాలిక అతనికి చెల్లించింది. తరువాత, బిజోయ్ రాయ్, అమ్మాయి పెళ్లిని అడ్డుకోవాలనుకున్నాడు. అమ్మాయి తన కాబోయే భర్త, మరో ఇద్దరు వ్యక్తులకు తామిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను పంపాడు, వారి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు యత్నించగా బంధువులు రక్షించారు.

నవంబర్ 2021లో, కూచ్ బెహార్‌లోని మెఖోలిగంజ్ పోలీస్ స్టేషన్‌లో బాలిక తండ్రి బిజోయ్ రాయ్‌పై భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ (పోక్సో) చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బిజోయ్ రాయ్‌ని అరెస్టు చేశారు.

విచారణలో, రాయ్ మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని పూణేలోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు. వారిద్దరి ఫొటోలను పంపిన ఇద్దరు వ్యక్తుల మొబైల్ ఫోన్‌లను కూడా పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అలా బాలిక అభ్యంతరకరమైన ఫోటోలను రికవర్ చేశారు. 

గురువారం, బిజోయ్ రాయ్‌ను మెఖోలిగంజ్ కోర్టు అదనపు జిల్లా జడ్జి హిరణ్మయ్ సన్యాల్ దోషిగా ప్రకటించి, 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 1,30,000 జరిమానాను ప్రకటించారు. ఈ కేసు గురించి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివాస్ ఛటర్జీ మాట్లాడుతూ, "పూణేలోని సెంట్రల్ ఫోరెన్సిక్ లేబొరేటరీ అందించిన డిజిటల్ సాక్ష్యం చాలా ముఖ్యమైన సాక్ష్యం" అని అన్నారు. కేసు గురించి మరిన్ని వివరాలు చెబుతూ, ట్రయల్ పీరియడ్ ఒక సంవత్సరం లోపు ముగిసిందని ఛటర్జీ చెప్పారు.