Asianet News TeluguAsianet News Telugu

రామనవమి ఊరేగింపులో తుపాకీతో యువకుడి హల్చల్..  వీడియో వైరల్.. కట్ చేస్తే.. 

రామ నవమి ర్యాలీల సందర్భంగా హుగ్లీ , హౌరాలో పలు చోట్ల మత ఘర్షణలు జరిగాయి.  హింస సమయంలో అనేక దుకాణాలు ధ్వంసమయ్యాయి. కొన్ని పోలీసు వాహనాలతో సహా అనేక కార్లు తగలబడ్డాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది.

Man Seen In Viral Video Holding Gun At Bengal Ram Navami Rally Arrested KRJ
Author
First Published Apr 4, 2023, 2:55 PM IST

పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో జరిగిన రామనవమి వేడుకల్లో ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ఉరేగింపులో ఓ యువకుడు మరణాయుధాలతో హల్చల్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఆ వీడియోను తృణమూల్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. వాస్తవ పరిస్థితిని చెప్పాడు. క్రమంలో ఈ పోస్టు వైరలయింది.

ఈ క్రమంలో పోలీసుల ద్రుష్టికి రావడంతో ఆ యువకుడిపై పోలీసులు నమోదు చేశారు. అతనిపై దర్యాప్తు జరిపి.. బీహార్‌లోని ముంగేర్‌లో సుమిత్ సావో అనే యువకుడుగా గుర్తించారు. అతనిపై దర్యాప్తు చేసి.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆ రోజు ఊరేగింపులో మారణాయుధాలతో పాల్గొన్నట్లు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడిని సీఐడీకి అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనపై సీఐడీ విచారణ జరుపుతోంది.

గత గురువారం హౌరాలోని శివపూర్‌లో రామనవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.  రాళ్లదాడి, దహనంతో వాతావరణం వేడెక్కింది. మరుసటి రోజు శివపూర్‌లోనూ దాదాపు అదే పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై హౌరా సిటీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ రోజు ఊరేగింపులో చాలా మంది ఆయుధాలు పట్టుకుని కనిపించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా పలు వీడియోల్లో చిన్నారులు, మైనర్లు ఆయుధాలతో కనిపించారు. దాని ఆధారంగా జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ (NCPCR) హౌరా సిటీ పోలీసులకు ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తూ నోటీసు పంపింది.

తృణమూల్ నాయకులు డెరెక్ బ్రయాన్, అభిషేక్ బెనర్జీ, కునాల్ ఘోష్ శివపూర్ ఈ ఘర్షణలకు సంబంధించిన పలు వీడియోలను ట్వీట్ చేశారు. వీడియోల ఆధారంగా.. హౌరా సిటీ పోలీసులు సుమిత్ సావో అనే యువకుడిని మారుమూల బీహార్‌లోని ముంగేర్‌లో గుర్తించారు. అక్కడి నుంచి అరెస్టు చేశారు. అతన్ని హౌరాకు తీసుకొచ్చారు.

తృణమూల్‌ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. 'బిజెపి బయటి వ్యక్తులను ఊరేగింపులో తీసుకువస్తోందని పదే పదే చెబుతున్నాం. హౌరా పోలీసులు పిస్టల్‌తో ముంగేర్‌కు చెందిన యువకుడిని అరెస్టు చేశారు. తాను ఆ ఊరేగింపులో ఉన్నానని, మారణాయుధాలతో వచ్చానని అంగీకరించాడు. బీజేపీ ఇప్పటి వరకు ఖండిస్తూ వచ్చింది. అన్నింటినీ సిఐడి విచారించనివ్వండి. బెంగాల్‌లో అశాంతి సృష్టించడానికి ఈ ముంగేర్ సైన్యాన్ని ఎవరు తీసుకువస్తున్నారో అందరికీ తెలియజేయండని ట్విట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios