ఓ వైపు రోజురోజుకూ కరోనా విజృంభిస్తూ.. అనేకమంది ప్రాణాలు తీస్తుంటే.. మరోవైపు కొంతమంది నిర్లక్ష్యంతో కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. లక్షణాలుంటే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు.
ఓ వైపు రోజురోజుకూ కరోనా విజృంభిస్తూ.. అనేకమంది ప్రాణాలు తీస్తుంటే.. మరోవైపు కొంతమంది నిర్లక్ష్యంతో కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. లక్షణాలుంటే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు.
ఇంత విలయం జరుగుతున్నా చదువుకున్నవారిలోనూ అవగాహన రాకపోవడమే విచారకరం. కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తి ఆస్పత్రిలో ఉండకుండా పారిపోయిన ఓ ఘటన షాకింగ్ గా మారింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తి ఆస్పత్రి నుంచి బైటికి పారిపోయిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పుదుకోట్టై జిల్లా ఆరందాంగి పరిసర ప్రాంతాల్లో కరోనా సోకినవారు ఆరందాంగి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో 32 యేళ్ల ఓ వ్యక్తికి కోవిడ్ లక్షణాలు ఉండడంతో సోమవారం పరీక్షలు చేసి కరోనా ప్రత్యేక వార్డులో ఉంచారు. పరీక్షల ఫలితం రాకుండానే తనను ఎందుకు వార్డులో ఉంచారంటూ ఆ వ్యక్తి ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగాడు.
అక్కడున్న తలుపు అద్దం పగులగొట్టి, ఎదురుగా వచ్చిన వారిపై ఉమ్మివేశాడు. రాత్రి విధుల్లో ఉన్న వైద్యుడు అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించడంతో వైద్యునిపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
చివరికి భార్యను ఆస్పత్రికి రప్పించి టూ వీలర్ మీద వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించేందుకు ఆస్పత్రి ప్రధాన వైద్యుడు శేఖర్ అతని కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. ఆస్పత్రిలో చికిత్స పొందకపోయినా హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.
