Jaipur: నెదర్లాండ్స్‌కు చెందిన ఓ మహిళపై జైపూర్‌లో ఆయుర్వేద మసాజ్ నెపంతో లైంగికదాడికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. అనంతరం నిందితుడు నగరం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులకు పట్టుబడ్డాడు.
Jaipur: దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన వారిపై నేరాలు, అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హింస మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట వారిపై హింస చోటుచేసుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయుర్వేద మసాజ్ పేరుతో ఓ విదేశీ మహిళపై లైంగిక దాడి జరిగిన ఘటన రాజస్జతాన్ లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నెదర్లాండ్ కు చెందిన బాధితురాలు.. పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు. ప్రస్తుతం రాజస్థాన్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జైపూర్ లో ఆయుర్వేద మసాజ్ ఇప్పిస్తానన్న నెపంతో ఓ వ్యక్తి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సింధీ క్యాంపు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వేగంగా పనిచేసిన పోలీసులు కేవలం నాలుగు గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు కేరళ వాసి. జైపూర్‌లోని ఖతీపురాలో మసాజ్ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేశాడు. లైంగిక దాడికి పాల్పడిన అనంతరం కేరళకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డాడు. నిందితులను పోలీసులు విచారిస్తున్నట్లు వెస్ట్ డీసీపీ రిచా తోమర్ తెలిపారు. గురువారం సాయంత్రం (మార్చి 16) సింధీ క్యాంపు పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (రేప్) కింద కేసు నమోదు చేయబడింది. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇదిలావుండగా, ఈ నెలలోనే ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో కూడా ఓ విదేశీ మహిళపై లైంగిక దాడి యత్నంకు సంబంధించిన కేసు నమోదైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ దారుణం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలో ఓ విదేశీ మహిళపై అత్యాచారయత్నం చేశారు. ఈ ఘటనపై నెల్లూరు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సైదాపురం పరిధిలోని రావూరు రోడ్డులోని అటవీ ప్రాంతంలో బ్రిటన్‌కు చెందిన మహిళపై కొందరు దుండగులు అత్యాచారానికి యత్నించారు. మహిళ వద్ద ఉన్న డబ్బులను దొంగిలించారు. అయితే మహిళ కేకలు వేయండంతో.. అక్కడికి సమీపంలోని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మహిళ కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
అనంతరం విదేశీ మహిళను స్థానికులు సైదాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన జరిగిన తర్వాత సదరు బాధిత విదేశీ మహిళకు అక్కడి మహిళ పోలీసుల సంరక్షణ కల్పించారు.
ఇదిలావుండగా, సభ్య సమాజం తలదించుకునే ఓ అమానవీయ ఘటన rajasthanలో చోటు చేసుకుంది. ధోల్ పూర్ లో ఓ దళిత మహిళ.. తన భర్త, పిల్లలతో కలిసి పొలం నుండి ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో కొందరు దుండగులు వారిని అడ్డగించి.. సదరు మహిళ husbandను తుపాకీతో కాల్చి చంపారు. ఆ తర్వాత బాధితురాలిని ఆమె పిల్లలను gunతో బెదిరించి ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
