బెంగళూరు: అందంగా వుందని స్నేహితుడి భార్యపైనే కన్నేసి బలవంతంగా అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడో కామాంధుడు. ఇలా బాధితురాలిని శారీరకంగా వాడుకోవడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు లాగాడు. అతడి వేధింపులు మరీ మితిమీరడంతో తట్టుకోలేక వివాహిత కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని చెన్నపట్టణ తాలుకా మత్తికెరెశెట్టిహళ్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ కు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. అయినప్పటికి అతడి కన్ను అందంగా వుండే తన స్నేహితుడి భార్యపై పడింది. దీంతో మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించి మత్తుమందు కలిపిన పానియాన్ని తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా లైంగిక దాడికి సంబంధించిన వీడియోను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. 

read more   భర్త చనిపోయిన మహిళపై లైంగిక వేధింపులు: కాపాడిన శునకం

లైంగిక దాడి  గురించి బయటపెడితే ఈ వీడియోను బయటపెడతానని బెదిరించడంతో బాధిత మహిళ మౌనంగా వుంది. దీన్ని అదునుగా భావించిన అతడు ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా డబ్బులు డిమాండ్ చేశాడు. అతడు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆమె బంగారు నగలను అమ్మింది. అయితే నగలు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గట్టిగా నిలదీయగా వివాహిత గతకొంతకాలంగా తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి బయటపెట్టింది. 

దీంతో బాధిత కుటుంబం మహిళాసంఘాల సహకారంతో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అతడి ఆదేశాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.