Asianet News TeluguAsianet News Telugu

13యేళ్ల కూతురిని కట్టేసి, అత్యాచారం.. 53యేళ్ల తండ్రికి 17 ఏళ్ల కఠిన కారాగార శిక్ష..

ఓ వ్యక్తి తన మొదటి భార్య కూతురైన 13యేళ్ల అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిలేని కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఆ కీచకుడికి కోర్టు 17యేళ్ల జైలుశిక్ష విధించింది. 

Man raped his 13years old teenage daughter, gets 17 years rigorous imprisonment in Mumbai - bsb
Author
First Published Feb 4, 2023, 12:42 PM IST

ముంబై : 13 ఏళ్ల కుమార్తెను కట్టేసి, కొట్టి, అత్యాచారం చేసిన 53 ఏళ్ల వ్యక్తికి 17 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ వారం ప్రారంభంలో కేసును విచారించిన ప్రత్యేక పోక్సో కోర్టు నేరం చాలా తీవ్రమైనదని పేర్కొంది. నిందితుడు మైనర్ బాధితురాలికి సంరక్షకుడు అయినప్పటికీ ఆమెపై ఇంత దారుణమైన నేరానికి పాల్పడ్డాడని చెప్పింది.

ఆ చిన్నారి పసితనంలోనే తల్లిని కోల్పోయింది. ఆ తరువాత ఆమె తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. రెండుసార్లు అలా లైంగిక వేధింపులకు గురైన తరువాత.. ఈ విషయం బయటపెట్టడానికి చిన్నారి ఇంట్లో నుండి పారిపోయి తన అమ్మమ్మగారింటికి వెళ్లింది.  అసభ్యంగా ప్రవర్తించడం గురించి ఫిర్యాదు చేసింది. ఒకానొక సందర్భంలో, చిన్నారి చేతులను వెనుకకు విరిచి కట్టివేసాడని తెలిపింది.

దీనిమీద న్యాయస్థానం తన అభిప్రాయాన్ని తెలుపుతూ.. నిందితుడి వయస్సు, అతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారనే వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శిక్షను తగ్గించలేమని పేర్కొంది. ఎందుకంటే నిందితులు చేసిన నేరాలు మైనర్ బాధితురాలి ఒత్తిడితో లేదా రెచ్చగొడితే చేసినవి కావు. నిందితుడు తన సొంత మైనర్ కుమార్తె కస్టడీ తీసుకుని.. బాధితురాలిని చూసుకోవాల్సిన సమయంలో ఆమెపై ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడు.. నిందితుడు వాదించినట్లుగా నిందితుడి మీద సానుభూతి చూపే అర్హత లేదు" అని కోర్టు పేర్కొంది.

వైరల్ వీడియో : ఈ కుక్క రాజసం చూడండి.. కదులుతున్న కారు మీద కూడా ఎంత ఠీవీగా కూర్చుందో...

ది ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింద ఉన్న నిబంధనల ప్రయోజనాన్ని పొందేందుకు అతనికి అర్హత లేదని కోర్టు పేర్కొంది. ఈ చట్టం ప్రకారం, నిందితుడు శిక్షను అనుభవించే బదులు మంచి ప్రవర్తనతో తప్పించుకోవచ్చు. 17 ఏళ్ల శిక్ష కచ్చితంగా న్యాయాన్ని చేకూరుస్తుందని కోర్టు పేర్కొంది. కోర్టులో విచారించిన సాక్షుల్లో బాధితురాలు, ఆమె అత్త కూడా ఉన్నారు. భార్య చనిపోయిన వెంటనే మరో వివాహం చేసుకున్నాడని.. అది మొదటి భార్య కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని.. అందువల్లే అతడిని తప్పుగా ఇరికించారని నిందితుడు వాదించాడు. దీన్ని కోర్టు తిరస్కరించింది.

“అమ్మాయికి ఇప్పుడు పెళ్లయిపోయింది. అయినా మైనర్ బాధితురాలు తన తండ్రిపై ఎందుకు ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసిందో అవి వాస్తవం కాదని చెప్పడానికి, నిరూపించడానికి డిఫెన్స్ దగ్గర సరైన ఆధారాలు లేవు, అవి వారు నిరూపించలేకపోయారు. అదే సమయంలో బాధితురాలు దృఢంగా, స్థిరంగా ఈ విషయాన్ని చెబుతోంది. ఆమె వాదన కన్వీన్సింగ్ ఉండడమే కాదు.. ఫిర్యాదుదారు అయిన ఆమె అత్త ఆమెకు పూర్తిగా మద్దతుగా నిలిచింది.." అని కోర్టు పేర్కొంది.

నిందితుడి రెండో భార్య, బాధితురాలి సవతి తల్లిని డిఫెన్స్ సాక్షిగా పిలిచింది. తన భర్త ప్యాంటు జేబులోంచి రూ.500 దొంగిలించిందని దీంతో.. తన భర్త చిన్నారిని కొట్టి, మందలించాడని ఆమె పేర్కొంది. అందుకే, ఆమె తన అమ్మమ్మ ఇంటికి పారిపోయిందని చెప్పింది. అత్యాచారం ఆరోపణలను మహిళ ఖండించింది. బాధితురాలితో పాటు మరో ఏడుగురు సభ్యులు నివసించే వారి చిన్న ఇంట్లో అది సాధ్యం కాదని చెప్పింది.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి గోప్యతను కాపాడేందుకు బాధితురాలి గుర్తింపును వెల్లడించలేదు)

Follow Us:
Download App:
  • android
  • ios