నిశ్చితార్థం చేసుకొనే యువతికే షాకిచ్చిన యువకుడు, డేటింగ్ కోసమే ఇలా...

Man posts woman’s profile on porn site, held
Highlights

తాను నిశ్చితార్థం చేసుకోబోయే యువతి ఫోటోను  ఫోర్న్‌ వెబ్‌సైట్‌లో పెట్టాడు ఓ యువకుడు. డేటింగ్ చేసేందుకే  ఆ యువతి ఫోటోను ఫోర్న్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు ఆ నిందితుడు. 


న్యూఢిల్లీ: తాను నిశ్చితార్థం చేసుకోబోయే యువతి ఫోటోను  ఫోర్న్‌ వెబ్‌సైట్‌లో పెట్టాడు ఓ యువకుడు. డేటింగ్ చేసేందుకే  ఆ యువతి ఫోటోను ఫోర్న్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు ఆ నిందితుడు.  బాధితురాలి పిర్యాదు మేరకు  పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూడడంతో  అంతా షాకయ్యారు.  ఈ ఘటన  న్యూఢిల్లీలో చోటు చేసుకొంది.

న్యూఢిల్లీలోని  వసంత్‌కుంజ్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి  ఓ విమాన సంస్థలో  ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తోంది.  ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు  నిర్ణయం తీసుకొన్నారు.ఈ సమయంలో  యువతి ప్రోఫైల్‌ను ఓ మ్యారేజీబ్యూరో‌ వెబ్‌సైట్ లో అప్‌లోడ్ చేశారు. 

అయితే  29 ఏళ్ల  మిలటరీ ఇంజనీర్ సర్వీస్ చేసే యువకుడు ఆ యువతిని వివాహం చేసుకొనేందుకు ముందుకు వచ్చారు.  రెండు కుటుంబాలు  కూడ ఈ వివాహనికి ముందుకు వచ్చాయి.  నిశ్చితార్థం కూడ చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు.  

అయితే  తాను నిశ్చితార్థం చేసుకోబోయే యువతి  ఫోటోను  అతను  ఫోర్న్‌వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు.  దీంతో డేటింగ్ వస్తావా అంటూ  పలువురి నుండి ఆ యువతికి ఫోన్లు వచ్చేవి.  దీంతో బాధితురాలు  ఏం జరిగిందని ఆరా తీస్తే తన ప్రోఫైల్‌ను ఫోర్న్‌సైట్‌లో పెట్టిన విషయాన్ని గుర్తించింది. ఈ విషయంతో షాక్‌కు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే  పోలీసుల విచారణలో బాధితురాలికి దిమ్మతిరిగే నిజం తెలిసింది.  ఎయిర్‌హోస్టెస్‌తో నిశ్చితార్థం చేసుకోబోయే  యువకుడే ఆమె ప్రోఫైల్‌ను ఫోర్న్‌ వెబ్‌పైట్‌లో  పెట్టాడని  తెలిసి  షాకయ్యింది.  బాధితురాలిని పెళ్లి చేసుకోకుండా ఆమెతో డేటింగ్ చేసేందుకు ఆ యువకుడు ఇలా చేశాడని  పోలీసుల దర్యాప్తులో తేలింది.

loader