Asianet News TeluguAsianet News Telugu

Viral: పులికి మాంసం ముద్దలు.. పెద్ద సాహసమే..!

కొందరు మాత్రం ఆ డ్రైవర్ చేసిన పనిని విమర్శిస్తున్నారు. క్రూర జంతువులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. అవి ఎలా అయినా ఎటాక్ చేస్తాయని.. వాటితో ఇలాంటి పరాచకాలు ఆడటం మంచిది కాదని.. దూరంగా ఉండాలని కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం.

Man Opens Window To Feed Tiger, What Happens Next Is Stunning
Author
Hyderabad, First Published Aug 6, 2022, 9:46 AM IST

మనం రోడ్డు మీద వెళ్తుంటే.. పులి కనిపిస్తే ఏం చేస్తాం. భయంతో అక్కడి నుంచి వెంటనే పారిపోవాలని చూస్తాం. ఒకవేళ మనం వాటిని చూడటానికి జూకి వెళ్లినా సరే.. అవి కొంచెం మన దగ్గరకు వస్తున్నాయి అంటే.. కాస్త దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తాం. అలాంటిది ఓ వ్యక్తి.. రోడ్డుపై వెళ్తున్న పులిని పిలిచి మరీ..  చిన్న పిల్లలకు లాలీ పాప్ ఇచ్చినంత సింపుల్ గా.. మాంసం ముద్దలు ఇచ్చాడు. అది కూడా.. వచ్చి చక్కగా తినేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో నేషనల్ జూ పార్క్ లో చోటుచేసుకుంది.

ఆ నేషనల్ జూ పార్క్ లో పనిచేసే బస్సు డ్రైవర్.. బస్సు కిటికీ తెరచి.. దానికి మాంసం తినిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే.. ఈ వీడియోని చూసి కొందరు వావ్.. అంటూ కామెంట్స్ చేస్తుండగా.. కొందరు మాత్రం ఆ డ్రైవర్ చేసిన పనిని విమర్శిస్తున్నారు. క్రూర జంతువులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. అవి ఎలా అయినా ఎటాక్ చేస్తాయని.. వాటితో ఇలాంటి పరాచకాలు ఆడటం మంచిది కాదని.. దూరంగా ఉండాలని కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం.

 

పూర్తి మ్యాటర్ లోకి వెళితే.. వీడియోలో ఒక బస్సు డ్రైవర్  పులిని చూసి బస్ డ్రైవర్ ని ఆపాడు. ఆ తర్వాత పులి దగ్గరకు రాగానే బస్సు  డ్రైవర్ దానికి మాంసం ముక్కను తినిపించాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బస్సు డ్రైవర్ చేసిన పని చాలా ప్రమాదకరమైనదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

చాలా మంది డ్రైవర్ చేసిన పనిని విమర్శించడం గమనార్హం. అంత తెలివి తక్కువ పని ఎవరైనా చేస్తారా అంటూ తిట్టిపోస్తున్నారు. అది ఏమీ చేయలేదు కాబట్టి సరిపోయింది. అలా కాకుండా అది ఆ కిటికీలో నుంచి దూకడానికి ప్రయత్నించినా... అతని చెయ్యి లాగాలని ప్రయత్నించినా.. ఏం జరిగేది అంటూ విమర్శిస్తున్నారు. ఒక చేతితో మాంసం తినిపిస్తూ... మరో చేతితో వీడియో తీస్తూ ఉండటం గమనార్హం. పులి కాస్త తెగించినా అతని పరిస్థితి మరోలా ఉండేదని.. ఇలాంటి పనులకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios