ప్రియురాలు మోసం చేసిందని ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. ఆమెను గొంతుకోసి చంపేసి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చత్తీస్ ఘడ్ : Chhattisgarhలోని రాయపూర్ సిటీలో దారుణం జరిగింది. 27 ఏళ్ల ఓ యువకుడు తన ప్రియురాలు తనకు తీరని ద్రోహం చేసిందని కోపంతో ఆమెను పదునైన ఆయుధంతో హతమార్చాడు. ఆ తర్వాత అతను కూడా suicide చేసుకుని చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. అతని దగ్గర దొరికిన సూసైడ్ నోట్ లో తాను రాయపూర్ లోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ డయల్ - 112లో కాల్ ట్రాకర్ గా పని చేస్తున్నట్లు తెలిపాడు. అయితే తాను ప్రేమిస్తున్న అమ్మాయి తనను మోసం చేసిందని.. వేరొకరిని ప్రేమిస్తోందని తెలియడంతో మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు అందులో రాశాడు. ఇద్దరూ కూడా ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలోని ఒకే గ్రామానికి చెందిన వారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఇలాంటి ఘటనే గుంటూరులో మేలో వెలుగు చూసింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం తురకపాలెంలో ఓ వ్యక్తి కుటుంబ కలహాల కారంగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు సెల్షీ వీడియోలో తన మరణానికి కారణాన్ని రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో తన భార్య మీద ఆరోపణలు చేశాడు. తన భార్య ప్రవర్తన సరిగా లేదని, ఆమె వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంగా ఉందన్నాడు. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తన భార్య మరొకరితో తరచుగా ఫోన్‌లో మాట్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
కదులుతున్న కారులో యువతిపై అత్యాచారయత్నం... తప్పించుకోవడానికి కిందికి దూకిన యువతి.. తీవ్రగాయాలతో....
ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసిందని.. వారంతా తననే తప్పుబడుతున్నారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు తనను చంపించేందుకు చాలాసార్లు ప్రయత్నం జరిగిందని ఆరోపించాడు. దీంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. తనకు వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉందన్నాడు. తనను మోసం చేసిన తన భార్యను కఠినంగా శిక్షించాలని కోరాడు. అంతేకాదు తన భార్య ఎప్పుడెప్పుడు అతడితో మాట్లాడిందో ఆ కాల్ వివరాలను తన దగ్గరే ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మీద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
