తోటి ఉద్యోగినిని లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో ఎక్కించుకుని అసహ్యంగా ప్రవర్తించాడో వ్యక్తి. ఆమెమీద అత్యాచారయత్నం చేయబోయాడు. అది తప్పించుకునే క్రమంలో ఆమె కదులుతున్న కారులో నుంచి కిందికి దూకేసింది.
ఉత్తరప్రదేశ్ : లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కించుకుని ఓ యువతి మీద లైంగికదాడికి ప్రయత్నించాడో కీచకుడు. ఈ క్రమంలో ఆ యువతి దాడి నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న కారులోనుంచి బయటికి దూకింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది. పోలీసులుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగింది. లక్నోలోని ఓ హోటల్ లో 21 యేళ్ల యువతి పనిచేస్తోంది. ఈ క్రమంలో హోటల్లో పనిచేసే ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది.
అతను ఆమెతో పరిచయాన్ని పెంచుకున్నాడు. తన బంధువు కూడా హోటల్ మేనేజ్మెంట్ లో పనిచేస్తుందని తెలిపాడు. ఏదో విషయంలో తనకు సహాయం చేయాలని కోరాడు. ఇందుకు బాధితురాలు సరేనని ఒప్పుకుంది. ఈ క్రమంలో మంగళవారం హోటల్లో పనులు ముగించుకుని బాధితురాలు ఇంటికి వెళుతున్న సమయంలో.. నిందితుడు ఆమెను కారులో డ్రాప్ చేస్తానని నమ్మబలికాడు. దీంతో అతడి మాటలు నమ్మిన ఆమె కారు ఎక్కింది. ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తరువాత అతడు యువతితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
దీంతో యువతి కంగు తిన్నది. బాధితురాలు కారు ఆపాలని ఎంతగా కోరినా ఆపలేదు. అసభ్యప్రవర్తన అలాగే కొనసాగించాడు. దీంతో janeshwar mishra పార్కు వద్ద కదులుతున్న ఎస్వీయూ కారులో నుంచి ఆమె కిందికి దూకేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాధితురాలి వద్దకు వెళ్లి ఆమె స్టేట్ మెంట్ తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. చివరికి నిందితుడిని అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నామని కారును సీజ్ చేసినట్లు ఏఎస్పీ శ్రీవాత్సవ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, జూలై 9న కూతురిమీద లైంగికదాడికి పాల్పడిన సవతి తండ్రి కేసు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో వెలుగుచూసింది. కన్నతండ్రిలా చూసుకోవాల్సిన మారుటి తండ్రి.. ఓ వైపు తల్లితో కాపురం చేస్తూ.. మరోవైపు కూతురి మీద అత్యాచారం చేశాడు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో జరిగిన ఈ ఘటన వివరాలు సబ్బవరం సీఐ చంద్రశేఖరరావు ఇలా చెప్పుకొచ్చారు.. సబ్బవరానికి చెందిన ఓ మహిళ భర్త తొమ్మిదేళ్ల కిందట మృతి చెందాడు. వారిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆమె సబ్బవరం సాయి నగర్ కాలనీకి చెందిన 34 ఏళ్ల వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అతని ద్వారా ఆమెకు మరో అమ్మాయి పుట్టింది. మొదటి కుమార్తె (13) సబ్బవరంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఏడవ తరగతి చదువు పూర్తి చేసింది.
చదువుకుంటున్న క్రమంలో సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు.. మారుటి తండ్రి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి ఒంటరిగా ఉన్న సమయంలో భయపెట్టి, బెదిరించి అత్యాచారం చేసేవాడు.ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. సెలవులు అయిపోయి స్కూల్స్ తెరిచినా.. బాలిక అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదు. ఆమె సబ్బవరానికి రావడాని ససేమిరా ఒప్పుకోలేదు. ఎంతగా అడిగినా కారణం చెప్పలేదు.
కానీ బాలిక జరిగింది చెప్పకుండా ఉండలేకపోయింది.. అలాగని జరిగిన దారుణాన్ని తన నోటితో చెప్పలేక పోయింది. దీంతో తనకు ఏం జరిగిందో ఓ చీటీమీద రాసి ఫ్రిడ్జ్ మీద పెట్టింది. అది చూసిన తల్లి చీటీ తీసుకుని చదివింది. షాక్ అయ్యాంది. వెంటనే కుమార్తెతో కలిసి సబ్బవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని స్టేషన్ సిఐ వివరించారు. అనకాపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారని చెప్పారు.
