ఓ వ్యక్తి తన ప్రియురాలిని రాయితో తలమీద కొట్టి హత్య చేశాడు. కొనఊపిరితో ఉన్న ఆమెతో సెల్పీ వీడియో తీసుకుని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.
కర్ణాటక : ఓ వ్యక్తి మహిళను రాయితో మోది హత్య చేశాడు. ఆ తర్వాత కొనఊపిరితో ఉన్న ఆమె దగ్గర కూర్చుని సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియో మొత్తాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి పక్కనే ఉన్న పొలంలో చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. సెల్ఫీ వీడియోలో ‘నా లక్ష్మిని ఈ లోకంలో లేకుండా చేశాను.. ఆమె నన్ను హంతకుడిగా మార్చింది’ అంటూ మాట్లాడాడు. వీడియో వైరల్ కావడం పొలంలో అతని మృతదేహం లభించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల విచారణలో కేసుకు సంబంధించి వెలుగు చూసిన విషయాలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. అనేక ట్విస్టులున్న ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటన చామరాజనగర జిల్లా మలెమహాదేశ్వరబెట్ట పరిధిలోని నాగమలెలో జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని పెన్నాగరం చెక్ పోస్ట్ ప్రాంతంలో లక్ష్మి(35) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె భర్తతో విభేదాల కారణంగా కర్ణాటక లోని నాగమలెకు వచ్చింది.
'మీడియాలో నా ప్రసంగం ఎక్కడా కనిపించదు' :రాహుల్ గాంధీ
అక్కడ తమిళనాడు రాష్ట్రం, ధర్మపురి జిల్లా వీరభద్రయ్యనహళ్లికి చెందిన మునిరాజు (40)పరిచయం అయ్యాడు. అతనితో లక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అలా కొద్ది కాలం గడిచిన తరువాత.. లక్ష్మి రెండో వివాహం చేసుకుంది. ఏడునెలల క్రితం నాగమలెకు చెందిన రమేష్ అనే వ్యక్తితో ఆమెకు రెండో పెళ్లి అయ్యింది. దీంతో మునిరాజుకు దూరం అయ్యింది.
కాగా, ఈ మంగళవారం నాడు లక్ష్మీని వెతుక్కుంటూ మునిరాజు నాగమలెకు వచ్చాడు. లక్ష్మి రెండో పెళ్లి సంగతి తెలుసుకుని.. కోపోద్రిక్తుడయ్యాడు. కాసేపు వాగ్వాదం తరువాత.. కోపంతో లక్ష్మి తల మీద రాయితో కొట్టి హత్య చేశాడు. అయితే.. లక్ష్మి కొనఊపిరితో ఉన్న సమయంలో ఆమె దగ్గర కూర్చున్నాడు. చంపేశానన్న బాధతో వీడియో రికార్డ్ చేశాడు. ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు.
‘నా లక్ష్మిని నేనే ఈ లోకంలో లేకుండా చేశాను.. ఆమె నన్ను హంతకుడిగా మార్చేసింది’ అంటూ మునిరాజు వీడియోలో మాట్లాడాడు. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లి.. బొమ్మ అనే వ్యక్తికి చెందిన పొలానికి చేరుకున్నాడు. అక్కడ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మునిరాజు. ఆ తరువాత ఇంటికి చేరుకున్న లక్ష్మి రెండో భర్త రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో మలెమహదేశ్వరబెట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
