ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీతో సంబంధాలున్న ఇద్దరు, ముగ్గురు పారిశ్రామిక వేత్తల చేతుల్లో మీడియా చిక్కుకుందనీ, అందుకే.. ప్రధాని ప్రసంగాల మాదిరిగా కాకుండా తన ప్రసంగాలు మీడియాలో కనిపించవని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా మీడియాను టార్గెట్ చేస్తూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీతో సంబంధాలున్న బడా పారిశ్రామిక వేత్తల చేతుల్లో మీడియా ఉందని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రసంగాల మాదిరిగా కాకుండా తన ప్రసంగాలు మీడియాలో కనిపించవని అన్నారు. మేఘాలయ ఎన్నికలు 2023 దృష్ట్యా రాజధాని షిల్లాంగ్‌లో ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ సహా మీడియాను టార్గెట్ చేశారు.
అలాగే.. టీఎంసీపై కూడా ఆయన సూటిగా విమర్శలు చేశారు. 'అదానీతో ఉన్న సంబంధాల గురించి నేను ప్రధానిని అడిగాను. అదానీ జీ విమానంలో ప్రధాని కూర్చొని, ప్రధాని మోదీ తన సొంత ఇల్లులా విశ్రాంతి తీసుకుంటున్న చిత్రాన్ని కూడా నేను చూపించాను. ఈ విషయంలో ప్రధాని మోదీ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని అన్నారు.
'నా ప్రసంగం ఎక్కడా కనిపించదు'
నా పేరు గాంధీ అని ఎందుకు ఉంది? నెహ్రూ అని ఎందుకు లేదు? అని ప్రధాని తనను ప్రశ్నించినట్టు చెప్పారు. పార్లమెంటులో తాను ప్రసంగించానని, అయితే పీఎం మోదీ ప్రసంగం చేసినప్పుడు టీవీలనిండా ఆయనే కనిపించారని, తన ప్రసంగం మాత్రం ఎక్కడా కనిపించలేదని అన్నారు.
తన ప్రసంగాలపై మీడియా కూడా లక్ష్యంగా చేసుకుందనీ, దానిని ప్రధాని మోడీ మనుషులు నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీతో సంబంధాలున్న ఇద్దరూ -ముగ్గురు బడా పారిశ్రామికవేత్తలు మీడియాను నియంత్రిస్తున్నారనీ. వారి నియంత్రణ నిర్భంధలా మధ్య తన ప్రసంగం మీడియాలో కనిపించడం లేదని రాహుల్ అన్నారు. ఇప్పుడు మీడియాలో కూడా మన భావాలు వ్యక్తపరచలేకపోతున్నామని వాపోయారు.
"మీకు టిఎంసి చరిత్ర కూడా తెలుసు, బెంగాల్‌లో జరిగే హింస గురించి మీకు తెలుసు.. వారి సంప్రదాయం గురించి మీకు తెలుసు, వారు గోవాకు వచ్చారు మరియు బిజెపికి సహాయం చేయాలనే ఆలోచనతో భారీగా డబ్బు ఖర్చు చేశారు. టిఎంసి ఆలోచనలో మేఘాలయలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా చూడాలని రాహుల్ గాంధీ అన్నారు.
ఈనెల 21న నాగాలాండ్‌లో జరిగిన ఒక ఎన్నికల ప్రచారంలో ఖర్గే పాల్గొన్నారు. గత 20 ఏళ్లలో నేషనల్ డెమోక్రటిక్ ప్రొగ్రసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ), బీజేపీ కలిసి నాగాలాండ్‌ను దోచుకుంటున్నాయనీ, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునే..సరైన సమయం వచ్చిందని ఖర్గే అధికార కూటమిపై విరుచుకుపడ్డారు. బిజెపి రాజకీయాలు నాగాల దేశీయ, విశిష్ట సంస్కృతిని నాశనం చేయడమే లక్ష్యమని అన్నారు. నాగాలాండ్ సంస్కృతి, ద్వేషపూరిత రాజకీయాలపై ఈ దాడికి వ్యతిరేకంగా నాగాలాండ్ ప్రజలు నిలబడాలి" అని ఖర్గే అన్నారు.
మేఘాలయ శాసనసభకు ఫిబ్రవరి 27న ఓటింగ్ జరుగుతుంది.మార్చి 2న ఓట్ల లెక్కింపు .మూడు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్ మరియు త్రిపుర ఫలితాలు ఒకే రోజు అంటే మార్చి 2న వెలువడనున్నాయి.
