పంజాబ్‌లోని జలంధర్‌లోని కోట్లి గ్రామానికి చెందిన రాజిందర్ సింగ్, ఎయిర్ హోస్టెస్‌తో తీవ్ర వాగ్వాదానికి ఆమెను వేధించాడు. అతడని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
అమృత్‌సర్ : దుబాయ్-అమృత్‌సర్ విమానంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఎయిర్‌హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెతో మొదట వాగ్వాదానికి దిగి, ఆ తరువాత వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో సదరు నిందితుడైన ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఈ ఘటన శనివారం జరిగింది.
పంజాబ్‌లోని జలంధర్‌లోని కోట్లి గ్రామానికి చెందిన రాజిందర్ సింగ్, శనివారంనాడు విమానంలో వస్తున్న సమయంలో ఎయిర్ హోస్టెస్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగి ఆమెను వేధించాడని పోలీసులు తెలిపారు."ఈ ఘటనను ఎయిర్ హోస్టెస్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి" అని పోలీసులు తెలిపారు.
మదర్స్ డే స్పెషల్ : ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఇండిగో విమానంలో తల్లీకూతుళ్ల వీడియో... ఏముందంటే...
సిబ్బంది ఈ విషయాన్ని అమృత్‌సర్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేశారు. వారు వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌లైన్ అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని ఇక్కడి శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవ్వగానే అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
సింగ్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 (గౌరవాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం), సెక్షన్ 509 (మహిళను కించపరిచేలా ఉద్దేశించిన పదం, సంజ్ఞ లేదా చర్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
