న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం ఇస్తానని నమ్మించి తన వద్దకు రప్పించుకుని మహిళపై 32 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఢిల్లీలోని షహీన్ బాగ్ ప్రాంతంలో జరిగింది. 

ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.బాధితురాలు ఘజియాబాదులో నివసిస్తూ ఓ కర్మాగారంలో పనిచేస్తూ వస్తోంది. ఉద్యోగం మారాలనే ఉద్దేశంతో తాను జాబ్ ఫర్ ఆల్ అనే వాట్సప్ గ్రూపులో చేరానని బాధితురాలు చెప్పింది. 

Also Read: డ్రింక్ తాగించి మహిళపై రైల్వే ఇంజనీర్ల గ్యాంగ్ రేప్

గ్రూపులో చాటింగ్ చేస్తుండగా నిందితుడు ఆమెకు ఫోన్ చేసి గ్రూపులో సభ్యుడినని, కొత్త ఉద్యోగం సంపాదించుకోవడానికి సహాయం చేస్తానని చెప్పాడు. దాంతో ఇరువురు చాటింగ్ చేసుకుంటూ వచ్చారు. 

బుధవారం నిందితుడు ఆ మహిళకు ఫోన్ చేశాడు. తాను ఉద్యోగం చూశానని, షహీన్ బాగు లోని అబుల్ ఫజల్ ఎంక్లేవ్ కు రావాలని చెప్పాడు. వెంటనే రాలేనని, మరోసారి వస్తానని ఆమె చెప్పింది. అయితే అతను ఒత్తిడి చేశాడు. దాంతో ఆమె తాను వస్తున్నట్లు, తనను శాస్త్రి పార్కు మెట్రో స్టేషన్ వద్ద పికప్ చేసుకోవాలని చెప్పింది. 

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.... మోటార్ సైకిల్ మీద ఆమెను నిందితుుడు అబుల్ ఫజల్ ఎంక్లేవ్ లోని తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. తినడానికి ఆమెకు కొన్ని ఆహారపదార్థాలు ఇచ్చాడు. వాటిని తినడానికి ఆమె  నిరాకరించింది. తనకు బాగాలేదని చెప్పింది. 

ఆ తర్వాత ఆమె రెండు చేతులు బిగించి పట్టుకుని ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను ఘజియాబాదులోని ఆమె ఇంటి వద్ద దింపేశాడు.ఆ తర్వాత పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఫోన్ స్విఛాప్ అయి ఉంది. ఇంటికి వెళ్లి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

లాక్ డౌన్ సమయంలో అతని ఉద్యోగం పోయిందని, దాంతో అతను ఉద్యోగం కోసం వాట్సప్ గ్రూపులో చేరాడు.