రైల్లో వ్యక్తి హస్తప్రయోగం': ఫేస్ బుక్ లో లైవ్ ఇచ్చిన యువతి

Man masturbates at station in Bengal, woman live streams incident
Highlights

పశ్చిమ బెంగాల్ లోని రైలులో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ లోని రైలులో ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేసుకుంటుండగా, దాన్ని ఓ మహిళ ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. 

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని రైలులో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ లోని రైలులో ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేసుకుంటుండగా, దాన్ని ఓ మహిళ ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. 

హౌరాకు చెందిన రైలు బందేల్ స్టేషన్ కు వచ్చినప్పుడు ఆదివారం మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.  బందేల్ నుంచి రైలు కదులుతున్న సమయంలో ఓ వ్యక్తి మహిళల కాంపార్టుమెంటుకు ఎదురుగా నిలబడి ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేసుకోవడం ప్రారంభించాడు 

ఆ విషయం రైల్వే సిబ్బందికి తెలియడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. దాదాపు 50 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించడాన్ని కొందరు మహిళలు గమనించారు. 

రైలు కదులుతుండడంతో మహిళలు వ్యతిరేకించలేకపోయారు. అయితే దాదాపు 20 ఏళ్ల వయస్సు గల ఓ యువతి సెల్ ఫోన్ తో చిత్రీకరిస్తూ ఫేస్ బుక్ లో లైవ్ చేసింది. 

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రుజువులు అడుగుతున్నారని, అందుకే తాను లైవ్ ఇచ్చానని, అతనేం చేసుకుంటాడో చేసుకోనీయ్ అంటూ ఆ యువతి ఆ వీడియోలో అన్నది.

ఆ యువతి సాహసం చేయడంతో ఇతర మహిళలు సంఘటనపై రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అతని మానసిక స్థితి బాగా లేనట్లు అనిపిస్తోందని, తాము బుర్ద్వాన్ జీఆర్పీకి సమాచారం అందించామని, అయితే అతను దొరకలేదని రైల్వే పోలీసులు అన్నారు. 

loader