తాను గే ననే విషయాన్ని దాచి పెళ్లి చేసుకొని మరో అమ్మాయి గొంతుకోసైనా వైనం గుజరాత్ లో వెలుగుచూసింది. ఆమెను మోసం చేయడమే కాకుండా ఈ విషయం బయటకు వెల్లడిస్తే చంపేస్తానని బెదిరించాడు ఆ ప్రబుద్ధుడు. దీనితో ఓపిక నశించిన ఆ  సంవత్సరం తరువాత బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

వివరాల్లోకి వెళితే.... అహ్మదాబాద్ కి చెందిన 32 సంవత్సరాల యువతి కి పెళ్లయి సంవత్సరమైంది. పెళ్ళైన ఏడాది వరకు తన భర్త  బాగానే ఉన్నాడని, ఆ తరువాత నెమ్మదిగా తనకు పురుషుల పట్లనే లైంగికాసక్తి ఎక్కువన్న విషయం బయటపెట్టాడు. ఇంకో విస్తుపోయే విషయం ఏమిటంటే.... ఆ యువతిని బా యువకుడు 2011లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

ఒక సంవత్సరం తరువాత అతని విషయం బయటపడింది. పురుషులతో ఎక్కువగా సఖ్యతగా ఉండడం, వారితో ఫోన్లో గంటలు గంటలు సంభాషించడంతో అనుమానం వచ్చిన యువతి అతని వాట్సాప్ చాట్స్ ని తిరగతోడింది. దీనితో అసలు విషయం బయటపడి అతడిని నిలదీయడంతో చావు కబురు చల్లగా చెప్పాడు. 

తాను డబ్బు కోసం, సమాజం కోసం మాత్రానే పెళ్లి చేసుకున్నాననే అసలు విషయాన్నీ బయటపెట్టాడు. భర్త అహ్మదాబాద్ లో లైబ్రేరియన్ గా పనిచేసేవారిని, అక్కడ పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకోవడంతో అతడిని ఉద్యోగం నుండి తొలగించారని ఆ యువతీ తన ఫిర్యాదులో పేర్కొంది. 

అక్కడ అతని ఉద్యోగం పోవడంతో నేరుగా పురుషులను ఇంటికే పిలిపించుకొని తన లైగిక వాంఛలు తీర్చుకునేవారని ఆ యువతి వాపోయింది. ఈ విషయం గురించి తన అత్తింటి వారికి ఫిర్యాదు చేసినప్పటికీ.... వారి నుండి ఎటువంటి సహకారం లభించలేదని, చిట్టచివరకు ఇక కంప్లయింట్ ఇస్తున్నట్టు ఆ యువతీ తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసారు.