ఓ వ్యక్తి తన భార్యను పక్కా ప్లాన్‌తో హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నవంబర్ 16న జరిగింది. వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌కు చెందిన తేజ్‌సింగ్, అతని భార్య దీపల్ కంవార్‌లు కొద్దిరోజుల క్రితం బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డారు.

నగరంలోని ఓ చోట చిన్న బంగారు దుకాణాన్ని నడుపుతూ.. హోణిసేమారనహళ్లి వద్ద జనతా కాలనీలో వీరు నివాసిస్తున్నారు. అయితే దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా దీపల్.. భర్తతో తరచుగా గొడవ పడేది.

Also Read:టీవీ సీరియల్ చూసి... భార్య హత్యకు స్కెచ్..

ఈ క్రమంలో భార్య వేధింపులు భరించలేకపోయిన తేజ్‌సింగ్ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకుని ప్లాన్ వేశాడు. కుట్రలో భాగంగా గత నెల 16న తన స్నేహితుడు గుర్‌ప్రీత్ సింగ్ పేరిట ఓ కారును అద్దెకు తీసుకున్నాడు.

అనంతరం భార్యతో పాటు మరో ఇద్దరు స్నేహితులు శంకర్ సింగ్, భరత్ సింగ్‌తో కలిసి అమృతహళ్లి సమీపంలోన ఓ హోటల్‌కు వెళ్లి డిన్నర్ చేశారు. అక్కడ స్నేహితులతో కలసి మద్యం సేవించిన తేజ్‌సింగ్, తన భార్యకు కూడా బలవంతంగా మద్యం తాగించాడు.

Also Read:ప్రియురాలి కోసం భార్య హత్య.. జవాను అరెస్ట్

ఆ తర్వాత వారిని ఇంటి వద్ద దించి రాత్రి 12.20 గంటలకు భార్యను అదే కారులో దేవనహళ్లి రోడ్డుకు తీసుకొచ్చాడు. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న దీపల్‌ను బచ్చళ్లి గేట్ సమీపంలో నడుస్తున్న కారులోంచి బయటకు తోసేసి, తర్వాత ఆమెపై కారు ఎక్కించి హత్య చేశాడు. కేసు విచారణలో అసలు నిజం తెలుసుకున్న పోలీసులు తేజ్‌సింగ్‌ను అతనికి సహకరించిన వారిని అరెస్ట్ చేశారు.