టీవీ సీరియల్ చూసి ఓ భర్త... భార్య హత్యకు కొత్త స్కెచ్ వేశాడు. అచ్చం సీరియల్ లో చూసినట్లుగానే.. ప్లాన్ వేశాడు.. కానీ.. బెడసికొట్టి.. పోలీసులకు చిక్కాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.... టీవీ సీరియల్ చూసి ఓ భర్త తన భార్యను చంపి... ఆ తర్వాత పామును తీసుకువచ్చి.. దాంతో భార్య మృతదేహానికి కాటు వేయించాడు. అందరికీ పాము కాటు వేయడంతో భార్యచనిపోయిందని నమ్మించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ఇండోర్ నగరానికి చెందిన అమితేష్ పటారియా(36) మాజీ బ్యాంకు మేనేజర్. అతను టీవీ సీరియల్ చూసి తన భార్యను హత్య చేసేందుకు పథకం వేశాడు. అమితేష్ తన చెల్లెలు, తండ్రితో కలిసి భార్య ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపాడు.

అనంతరం రాజస్థాన్ రాష్ట్రం నుంచి కొన్న నల్ల తాచుపామును ముందుగానే తీసుకువచ్చి ఇంట్లో బుట్టలో దాచి పెట్టాడు. నల్ల తాచుపామును బయటకు తీసి దాంతో భార్య మృతదేహానికి కాటు వేయించాడు. అనంతరం అమితేష్ ఆ నల్లతాచుపామును చంపి మృత దేహం పక్కన ఉంచాడు. 

పాము కాటువేయడం వల్లే భార్యచనిపోయిందని అందరినీ నమ్మించాడు. అయితే... భార్య మృతదేహానికి చేసిన పోస్టుమార్టం నివేదిక, అమితేష్ ఫోన్ లో ఉన్న ఫోటోలతో అతను భార్యను హతమార్చి పాము కాటు అంటూ నాటకమాడుతున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

దీంతో భార్యను హతమార్చిన అమితేష్ తోపాటు అతని తండ్రి, చెల్లెలిని పోలీసులు అరెస్టు చేశారు. భార్య హత్య కేసుతోపాటు నల్లతాచుపామును చంపినందుకు వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద అమితేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.