నాగపూర్: మహారాష్ట్రలో దారుమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన ప్రేయసి బామ్మను, తమ్ముడిని హత్య జచేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగపూర్ లోని మోమిన్ పురాకు చెందిన మెయిన్ ఖాన్ (22) నిరుడు నవంబర్ లో గుంజన్ అనే అమ్మాయితో సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాడు. 

ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఇరువురు తరుచుగా ఫోన్ లో మాట్లాడుకునేవారు. మొయిన్ ను తన స్నేహితుడిగా కుటుంబ సభ్యులకు గుంజన్ పరిచయం చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి ఇరువురు కూడా ప్రేమలో పడ్డారు 

వారి ప్రేమ విషయంపై గుంజన్ కుటుంబ సభ్యులు మొయిన్ ను హెచ్చరించారు ఆమెకు దూరంగా ఉండాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదరువుతాయని హెచ్చరించారు. గుంజన్ ను తమ బంధువుల ఇంటికి పంపించేశారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన మొయిన్ గురువారం మధ్యాహ్నం ప్రేయసి ఇంటికి వెళ్లాడు. 

ఆ సమయంలో గుంజన్ పదేళ్ల తమ్ముడు, 70 ఏళ్ల బామ్మ ప్రమీలా మారుతీ ధర్వే ఇంట్లో ఉన్నారు గుంజన్ కు సంబంధించిన వివరాలు చెప్పడానికి వారు నిరాకరించారు. దాంతో గుంజన్ వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరినీ పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.

ఆదే రోజు రాత్రి మంకాపూర్ ఏరియా రైల్వే ట్రాక్ వద్ద మొయిన్ ఖాన్ శవమై తేలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుంజన్ కుటుంబ సభ్యులను చంపిన తర్వాత రైలుకు ఎదురెళ్లి మెయిన్ ఖాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చుకున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యలకు కారణమని పోలీసులు చెప్పారు.