మహారాష్ట్రలో ఇద్దరు మిత్రులూ తరుచూ మద్యం సేవించేవారు. అందులో ఒకరు తల్లిదండ్రులను చిన్నప్పుడే పోగొట్టుకున్నాడు. మరో మిత్రుడు ఆ మిత్రుడి మరణించిన తల్లిదండ్రులను తరుచూ తిడుతుండేవాడు. దీంతో ఆగ్రహంతో మిత్రుడిని చంపేసి డెడ్ బాడీకి బండ కట్టి నదిలో విసిరేశాడు.
ముంబయి: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హేమంత్ అలియాస్ కిరణ్ నందు కాదవ్(24), రాధేశ్యామ్ మోహిలాల్ సింగ్‌లు ఆరు నెలల నుంచి మిత్రులు. రాధేశ్యామ్ మోహిలాల్ సింగ్ చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు తన బాల్యంలోనే మరణించినా ఇప్పటికీ వారంటే అమితమైన ప్రేమ గుండెల్లో దాచుకున్నాడు. హేమంత్ తన తల్లిదండ్రులను తరుచూ దూషిస్తూ మాట్లాడటాన్ని రాధేశ్యామ్ మోహిలాల్ సింగ్ సహించలేకపోయాడు. చంపేసి నదిలో పడేశాడు. ఈ ఘటన థానే జిల్లాలో చోటుచేసుకుందని పోలీసులు శనివారం తెలిపారు.
ముర్బద్ పోలీస స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ పంద్రే మాట్లాడుతూ.. జూన్ 11న ఓ వ్యక్తి డెడ్ బాడీ తమకు నదిలో లభించిందని వివరించారు. పెద్ద బండరాయిని ఆ డెడ్ బాడీకి కట్టేసిన స్థితిలో తమకు లభించిందని తెలిపారు.
ఈ కేసు విచారిస్తుండగానే.. తమకు హేమంత్ అనే వ్యక్తి కనిపించడం లేదనే ఫిర్యాదు అందిందని చెప్పారు. నదిలో నుంచి ఆ డెడ్ బాడీ బయటకు తీశారు. తీరా చూస్తే.. అది హేమంత్ అనే తేలింది.
Also Read: విపక్షాల ఐక్యతకు టీఎంసీ షాక్.. సీపీఎంతో జతకడితే కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వం: మమతా బెనర్జీ స్పష్టీకరణ
ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇన్‌పుట్స్ పరిశీలించి హేమంత్‌ను చంపిన వ్యక్తిని ఆరా తీయగా అది ఆయన ఫ్రెండ్ రాధేశ్యామ్ మోహిలాల్ సింగ్ అనే తేలింది. సింగ్ చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించినట్టు పోలీసులు తెలుసుకున్నారు. రాధేశ్యామ్ మోహిలాల్ సింగ్, కాదవ్‌లు ఆరు నెలల క్రితమే మిత్రులు అయ్యారు. తరుచూ వారిద్దరూ కలిసి మద్యపానం సేవించేవారు. కాదవ్ తరుచూ సింగ్ తల్లిదండ్రులపై నోరుపారేసుకునేవాడు.
కాదవ్ తరుచూ మరణించిన తన తల్లిదండ్రులను దూషించడాన్ని రాధేశ్యామ్ మోహిలాల్ సింగ్ జీర్ణించుకోలేడు. ఆగ్రహంతో ఓ రోజు కాదవ్‌ను బండతో మోదాడు. తాడుతో ఉరేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని నదిలో పడేశాడని పోలీసులు పేర్కొన్నారు.
