భువనేశ్వర్: ఒడిశాలో భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. 62 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. చేతబడిపై నమ్మకంపై అతను ఆ పాశవిక చర్యకు ఒడిగట్టాడు. మహిళను చంపిన తర్వాత మొండెం నుంచి తలను వేరి, తలను పట్టుకుని వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. 

ఛతారా గ్రామానికి చెందిన కార్తిక్ కెరాయి (30) అనే యువకుడి కుటుబ సభ్యుడు ఒకతను అనారోగ్యం పాలయ్యాడు. దాంతో అతన్ని నందిని పుత్రి (62) అనే వృద్ధురాలి వద్దకు తీసుకుని వెళ్లాడు. మంత్రాలతో ఆ వృద్ధురాలు రోగాలు నయం చేస్తుందని నమ్ముతారు. 

తన కజిన్ ను బాగు చేయాలని కార్తిక్ వృద్ధురాలినికోరాడు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించింది. దాంతో ఇరువురు కూడా ఇంటికి తిరిగి వెళ్లాడు. అయితే, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే కెరాయికజిన్ ఆరోగ్యం క్షీణించింది. అతన్ని వెంటనే కటక్ లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు.  

అయితే కార్తిక్ కజిన్ బ్రదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, నందిని మంత్ర ప్రయోగం వల్లనే తన కజిన్ మరణించాడని కార్తిక్ భావించాడు దాంతో కార్తిక్ కెరాయి బుధవారం రాత్రి ఆమెపై గొడ్డలితో దాడి చేశారు. తల నరికి ఉన్మాదిలా ప్రవర్తించాడు. 

ఆ తర్వాత తలను చేతిలో పట్టుకుని దనగాడి పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.