Asianet News TeluguAsianet News Telugu

ఎఫైర్ కోసం భార్య, పిల్లల హత్య.. నడి ఇంట్లో పాతిపెట్టి.. తానూ మరణించినట్టు కలరింగ్.. నిజమేంటంటే

గ్రేటర్ నోయిడాలో వివాహేతర సంబంధం కోసం పెళ్లి చేసున్న భార్యను, కన్న ఇద్దరు పిల్లలనూ చంపి నడి ఇంట్లో పాతిపెట్టాడో దుర్మార్గుడు. అంతేకాదు, పోలీసుల దర్యాప్తును తప్పించుకోవడానికి స్వయంగా మరణించినట్టూ కలరింగ్ ఇచ్చాడు. ఓ యువకుడిని చంపి అది ఆయన మృతదేహమేనని నమ్మించే ప్రయత్నం చేశాడు. డీఎన్ఏ టెస్టులో అసలు విషయం బయటపడ్డాక నిందితుడిని నేరాలు చేసిన మూడేళ్ల తర్వాత యూపీ పోలీసులు అరెస్టు చేశారు.

man killed wife, children for affair, and staged self death too in Uttar pradesh
Author
New Delhi, First Published Sep 2, 2021, 4:00 PM IST

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ సెన్సేషనల్ కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ భర్త.. భార్య పిల్లలను హతమార్చాడు. పోలీసుల దర్యాప్త ముమ్మరంగా సాగుతుండటంతో స్వయంగా తానే చనిపోయినట్టు పక్కా స్కెచ్ వేశాడు. అందరినీ నమ్మించాడు. కానీ, మూడేళ్ల తర్వాత అసలు నిజం వెలుగులోకి వచ్చింది. అందరినీ మోసం చేసిన నిందితుడు మరో రాష్ట్రం చెక్కేసి కొత్త పేరుతో నాటకం ప్రారంభించాడు.

గ్రేటర్ నోయిడాకు చెందిన 34 ఏళ్ల రాకేష్ యూపీ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ ఎఫైర్‌కు అడ్డుగా ఉన్న తన భార్య, పిల్లల(18 నెలలు, మూడేళ్ల పిల్లలు)ను ఇద్దరూ కలిసి 2018లో మట్టుబెట్టారు. ఎవరికీ  అనుమానం రాకుండా నడి ఇంట్లో పాతిపెట్టాడు. సిమెంట్ వేసి గోతిని పూడ్చేశాడు. తర్వాత ఆయనే వెళ్లి పోలీసులకు మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చాడు. తన భార్య పిల్లలను తీసుకుని చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలిపోయిందని ఫిర్యాదు చేశాడు.

రాకేష్ మామ కూడా కోరుకు వెళ్లాడు. కిడ్నాప్, వరకట్న వేధింపుల కింద పోలీసులతో కేసు నమోదు చేయించాడు. ఎన్ని నెలలు గడిచినా కేసు ముందుకు సాగలేదు.

ఈ కేసుల నుంచి తనకు శాశ్వత విముక్తి కావాలని రాకేష్, ఆయన గర్ల్‌ఫ్రెండ్ ఘరానా స్కెచ్ వేశారు. కాస్‌గంజ్‌లోని మరో వ్యక్తిని ఇరువురూ కలిసి హతమార్చారు. ఆ యువకుడి చేతులు, తల కాల్చివేసి, ఆ మృతదేహంతో రాకేష్ ఐడీ కార్డులను ఉంచి చనిపోయింది తానే అని నమ్మించే ప్రయత్నం చేశాడు.

పోలీసులు మర్డర్ కేసు దాఖలు చేసి తల లేని ఆ మృతదేహం నుంచి శాంపిల్ తీసి డీఎన్ఏ టెస్టుకు పంపారు. మృతదేహం రాకేష్‌ది కాదని రిపోర్టు తేల్చింది. ఈ రిపోర్టు తర్వాతే పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. హర్యానాలో దిలీప్ శర్మ పేరుతో నివసిస్తున్న రాకేష్ దాకా పోలీసులు చేరుకున్నారు. ఆయన ల్యాబ్‌లో పాథలాజిస్టుగా పనిచేస్తున్నందున నేరం జరిగిన చోట్లలో ఆధారాలు ఉండకుండా తెలివిగా బిహేవ్ చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో రాకేష్‌తోపాటు ఆయన గర్ల్‌ఫ్రెండ్, రాకేష్ ముగ్గురు కుటుంబీకులను అరెస్టు చేశారు. రాకేష్ తండ్రి రిటైర్డ్ పోలీసు. ఈ నేరంలో కుటుంబ సభ్యుల సహకారమూ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios