Asianet News TeluguAsianet News Telugu

పదేళ్లు చిన్నవాడితో రిలేషన్.. రాత్రిపూట తనతో గడపడానికి ఒప్పుకోలేదని... ప్రియురాలి గొంతు నులిమి చంపిన ప్రియుడు.

తనకంటే పదేళ్లు చిన్నవాడైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందో మహిళ. అయితే, అతనితో రాత్రి గడపడానికి నిరాకరించిందని ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. 

man killed lover for not agreed to stay with him,uttarpradesh
Author
First Published Dec 27, 2022, 12:50 PM IST

ఉత్తరప్రదేశ్ : ప్రదేశ్ లోని ఘజియాబాద్లో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. తనతో కలిసి రాత్రి గడిపేందుకు ప్రియురాలు  నిరాకరించిందని ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు ప్రియుడు. ఓ వైపు రకరకాల కారణాలతో సహజీవనం చేస్తూ,  వివాహేతర సంబంధాలు నెరుపుతూ..  చిన్నచిన్న కారణాలకే భాగస్వాములను హత్య చేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు ప్రేమను నిరాకరించిందని, ప్రేమించలేదని యువతుల మీద దాడులకు తెగబడుతున్న ఘటనలూ భయపెడుతున్నాయి. ఇలాంటి భయాందోళన కలిగించే ఘటనే ఉత్తరప్రదేశ్ లో వెలుగు చేసింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రచన (44)అనే ఓ మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తోంది. ఆమె ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పట్ లో ఉంటోంది. ఆమెకు వివాహం అయ్యింది. భర్త రాజ్ కుమార్. కూలీపనులకు వెడుతుంటాడు. అయితే, రచనకు కొద్ది కాలం క్రితం తనకంటే పదేళ్లు చిన్నవాడైన ఓ వ్యక్తితో పరిచయం అయ్యింది. అతని పేరు గౌతమ్ (34).  అతను బీహార్ లోని భోజ్ పుర్ కి చెందిన వాడు. వీరిద్దరి మధ్య స్నేహం కొంత కాలానికి ప్రేమగా మారింది. అది కాస్తా, వివాహేతర సంబంధంగా మారింది. 

డిసెంబర్ 23న వీరు మీరట్ లో కలుసుకోవాలనుకున్నారు. అక్కడ రెండు రాత్రులు హోటల్ లో బస చేశారు. తరువాత ఆదివారం సాయంత్రం ఘాజియాబాద్ చేరారు. అక్కడ ఆదివారం రాత్రి 9 గంటలకు ఒక హోటల్ లో బస చేశారు. అయితే వచ్చేప్పుడు గౌతమ్, రచన ఇద్దరూ వచ్చారు. కానీ సోమవారం ఉదయం 10.30కు మాత్రం గౌతమ్ ఒక్కడే హోటల్ నుంచి బయటికి వెళ్లాడు. అలా వెళ్లినవాడు మళ్లీ తిరిగి రాలేదు. 

రూం క్లీనింగ్ లో భాగంగా హౌజ్ కీపింగ్ సిబ్బంది మధ్యాహ్నం హోటల్ రూంలోకి వెళ్లి చూశారు. అక్కడ రచన చనిపోయి ఉంది. వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. రచన మరణించిన విషయాన్ని భర్త రాజ్ కుమార్ కు తెలిపారు. ఆ తర్వాత విచారణలో భాగంగా సీబీఐ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దీని ఆధారంగా 24 గంటల్లోనే నిందితుడిని గౌతమ్ ను అరెస్టు చేశారు. మురాద్ నగర్ లోని గంగా కెనాల్ రోడ్డులో దాక్కున్న అతడిని  పట్టుకున్నారు.

బీహార్ లో పరువు హత్య : చెల్లితో సన్నిహితంగా ఉన్నాడని, చంపి, ముక్కలు చేసి.. కుక్కలకు ఆహారంగా వేశాడు..

నిందితుడు పోలీసుల విచారణలో  నేరం ఒప్పుకున్నాడు. రచనను చంపడానికి దారితీసిన పరిస్థితులు గురించి చెప్పుకొచ్చాడు.  నాలుగు నెలలుగా తనకు రచనతో పరిచయం ఉందని చెప్పాడు.  అయితే ఆదివారం రాత్రి హోటల్ గదిలో తనతోపాటు ఉండడానికి ఆమె ఒప్పుకోలేదని  చెప్పాడు. ఇంటికి వెళ్లిపోతానని మంకుపట్టు పట్టిందని.. అందుకే ఆవేశంతో గొంతు పిసికి హత్య చేసినట్లు గౌతమ్ చెప్పాడు. రచనను ఆదివారం రాత్రే హత్య చేశాడు. ఆ తర్వాత రాత్రంతా శవంతో పాటు అదే గదిలో ఉన్నాడు. ఈ మేరకు మురాదాబాద్ పోలీసులు వివరాలు తెలిపారు. 

ఐపీసీ సెక్షన్ 302 506 ప్రకారం  నిందితుడిపై కేసు నమోదు చేశారు. రచన మృతి విషయంలో భర్త రాజ్ కుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్ 23న రచన ఇంటి నుంచి ఆఫీస్కు వెళుతున్నానని చెప్పి వెళ్ళింది అని..  రాత్రికి ఫోన్ చేసి మీటింగ్ ఉంది లేట్ అవుతుందని చెప్పిందని అన్నాడు. అయితే  రాత్రి పదకొండు తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వచ్చిందని.. దీంతో ఏదైనా జరిగిందేమో అని భయంతో ఆఫీసుకు వెళ్లగా ఆ రోజు ఆమె ఆఫీస్ కి రాలేదని తెలిసింది అని అన్నాడు.

అయితే ఒకరోజు తర్వాత డిసెంబర్ 25వ తేదీన ఉదయం 5 గంటలకు తనకు రచన ఫోన్ చేసిందని..  ఇంటికి వస్తున్నానని చెప్పింది కానీ ఎక్కడికి వెళ్లిందో చెప్పలేదు. కానీ రాత్రి వరకు ఇంటికి చేరలేదు. మళ్లీ రాత్రి పది గంటలకు ఫోన్ చేసి తాను ఘజియాబాద్లో ఉన్నట్లుగా  చెప్పుకొచ్చింది. హోటల్ గదిలో ఉన్నానని..  తనతో పాటు గౌతమ్ అనే వ్యక్తి ఉన్నాడని.. అతడు ఇంటికి రానివ్వడం లేదని చెప్పింది. ఇంటికి రావడానికి తనకు సహాయం చేయాలని అన్నది. ఆమె ఫోన్ వచ్చిన వెంటనే నేను వెదకడం ప్రారంభించాను.. ఇంతలోనే చనిపోయినట్లుగా ఫోన్ చేసి చెప్పారని భర్త అన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios