సహజీవన భాగస్వామిని దారుణంగా హత్య చేసి.. శరీరాన్ని ముక్కలుగా చేశాడో కిరాతకుడు. ఆ తరువాత శరీర భాగాలను కుక్కర్ లో ఉడకించి, కుక్కలకు ఆహారంగా వేశాడు. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది. 

ముంబై : ఢిల్లీ శ్రద్ధావాకర్ హత్య కేసులాంటి దారుణమైన ఘటన ఒకటి ముంబైలో వెలుగుచూసింది. సహజీవనం చేస్తున్న భాగస్వామిని అతి కిరాతకంగా చంపి.. శరీరాన్ని చెట్లు నరికే యంత్రంతో ముక్కలుగా చేశాడో నరరూపరాక్షసుడు. ఆ తరువాత శరీర భాగాలను కుక్కర్ లో ఉడకించి, కుక్కలకు ఆహారంగా వేశాడు. ఈ ఘటన ముంబై సమీపంలోని థానేలో వెలుగు చూసింది. 
థానేలోని ఒక ఇంటి నుండి కుళ్ళిపోయిన దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి చూడగా ముక్కలుగా చేసిన శరీర భాగాలు ప్లాస్టిక్ బ్యాగులు, బెడ్‌షీట్‌లలో చుట్టి ఉండడం గుర్తించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా శ్రద్ధా వాకర్ హత్య కేసు జ్ఞాపకాలను తిరిగి తెచ్చాయి. పోలీసులు ఈ కేసులో అతని సహచరురాలిని చంపి, ఆమె శవాన్ని ముక్కలుగా నరికిన వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలు, 36 ఏళ్ల సరస్వతి వైద్యగా గుర్తించారు.

హైదరాబాద్ లో ఇంటిముందు క్షుద్రపూజలు.. 16 యేళ్ల బాలిక ఆత్మహత్య..

బుధవారం అర్థరాత్రి మీరా-భయందర్ ప్రాంతంలోని నివాస భవనంలోని ఏడవ అంతస్తులోని ఆమె అపార్ట్‌మెంట్‌లో శవమై.. ముక్కలుగా చేయబడిన ఆమెను కనిపెట్టినట్టు నయా నగర్ పోలీసు స్టేషన్‌లోని సీనియర్ అధికారి తెలిపారు.

వైద్య తన భాగస్వామి మనోజ్ సహాని (56)తో కలిసి గత మూడేళ్లుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు అధికారి తెలిపారు. ఈ జంట అద్దె ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వైద్య, సహాని అపార్ట్‌మెంట్ నుండి అసహ్యకరమైన వాసన వస్తోందని.. మిగతా ఫ్లాట్ వాసులు ఫిర్యాదు చేయడంతో ఈ భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులను అప్రమత్తం చేసినట్లు సీనియర్ అధికారి తెలిపారు.

ఘటనా స్థలానికి చేరుకున్న తరువాత, అధికారులు వైద్య కుళ్ళిన మృతదేహాన్ని కనుగొన్నారు, అనేక ముక్కలుగా చేయబడిఉంది. "ప్రాథమిక విచారణలో మహిళ దారుణంగా హత్యకు గురైనట్లు తేలింది" అని ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) జయంత్ బజ్బలే తెలిపారు. ఈ భయానక ఘటనపై అధికారులు సహానిని అరెస్టు చేశారు. నేరానికి గల ఉద్దేశ్యం ఇంకా తెలపడం లేదు.

వైద్యను ఇంత దారుణంగా మరణించడానికి దారితీసిన పరిస్థితులను అంచనా వేసేందుకు అధికారులు కృషి చేస్తున్నందున ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. "పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. వైద్యకు న్యాయం జరగాలని ఆ దిశగా కృషి చేస్తున్నాం" అని బజ్బలే చెప్పారు. "మా దర్యాప్తులో సహాయ పడే సమాచారం ఎవరిదగ్గర ఉన్నా ముందుకు రావాలని ప్రజలను కోరుతున్నాం" అన్నారు.

నిరుడు శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనకు, ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ముంబై హత్య కేసుకు విచిత్రమైన పోలికలు ఉన్నాయి.

వాకర్ 27 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగి, ఆమె లైవ్-ఇన్ భాగస్వామి ఆఫ్తాబ్ పూనావాలా.. ఆమెను గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి 18 రోజుల పాటు రోజుకో వైపు..అడవిలో పారేశాడు. ఆమె శరీర భాగాలను కొన్నింటిని ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ఆమెను గుర్తించడానికి వీలు లేకుండా ముఖాన్ని కాల్చాడు.

నెలల తరబడి ఆమెనుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో శ్రద్ధా వాకర్ తండ్రి మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో ఆరు నెలల తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆఫ్తాబ్ పూనావాలాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అభియోగాలు మోపారు.