హర్యానాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్యను, కన్నబిడ్డలను దారుణంగా హత్య చేసి ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లోని ఉప్పల్‌ సౌత్ఎండ్‌హోంలో నివిసిస్తున్న ప్రకాశ్ సింగ్ ఫార్మాసంస్థలో ఉద్యోగిగా  పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో గత ఆదివారం రాత్రి భార్య సోనూసింగ్, కుమార్తె అదితి, కుమారుడు ఆదిత్య‌లను పట్టుకుని సుత్తితో వారిపై దాడికి దిగాడు. అక్కడితో ఆగకుండా కత్తులతో విచక్షణారహితంగా పొడిచి, వారి గొంతులు కోశాడు.

అనంతరం ప్రకాశ్ సింగ్ తన పెంపుడు కుక్కలతో గంటసేపు ఆడుకున్నాడు. వాటికి ఆహారంపెట్టి.... అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసి, ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అయితే టీవీల్లో వచ్చే క్రైమ్ వార్తలను ఇష్టంగా చూసే ప్రకాశ్ సింగ్.. వాటి కారణంగా ప్రభావితమై దారుణానికి పాల్పడి వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.