Asianet News TeluguAsianet News Telugu

పబ్లిక్ టాయిలెట్‌ వాడుకుని డబ్బులివ్వలేదని ఒకరి హత్య.. ముంబైలో దారుణం..

టాయిలెట్ ఉపయోగించుకుని డబ్బు చెల్లించకుండా వెళ్లిపోతుంటే.. దాని కేర్‌టేకర్.. బాధితుడి మధ్య జరిగిన వివాదం చివరికి హత్యకు దారి తీసింది.  

Man Killed At Public Toilet During Argument Over Charges in Mumbai
Author
First Published Dec 16, 2022, 8:01 AM IST

ముంబై : పబ్లిక్ టాయిలెట్‌ ఛార్జీల విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణాలు తీసింది. ఈ షాకింగ్ ఘటన ముంబైలో వెలుగు చూసింది. చార్జీల చెల్లింపు విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తిని పబ్లిక్‌ టాయిలెట్‌ కేర్‌టేకర్‌ హత్య చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. సెంట్రల్ ముంబైలోని దాదర్ ప్రాంతంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న పబ్లిక్ టాయిలెట్ సమీపంలో బుధవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. బాధితుడు రాహుల్ పవార్ టాయిలెట్‌ను వినియోగించుకుని డబ్బులు చెల్లించకుండా వెళ్లిపోతుండగా కేర్‌టేకర్ విశ్వజీత్ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ వాగ్వాదం మధ్యలో రాహుల్ పవార్ తనపై కత్తితో దాడికి యత్నించాడని, దీంతో తాను అతడి తలపై చెక్క రాడ్‌తో తిరిగి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని నిందితుడు తెలిపారు. విచారణ అనంతరం మాతుంగ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 

రాష్ట్రాలు ఏకరీతి పౌర స్మృతిపై చట్టాలు చేయవచ్చు.. : కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు

ఇదిలా ఉండగా, ఇలాంటి దారుణమైన హత్య ఘటనే మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బీమా డబ్బుల కోసం స్నేహితుడిని హత్య చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో కలకలం రేపింది. నాసిక్ లో నివసించే అర్జున్ రమేష్ భలేరావు పేరు మీద రూ. నాలుగు కోట్ల బీమా పాలసీ ఉంది. ఆ విషయం స్నేహితులకు తెలుసు. ఆ సొమ్ము మీద వారి కన్ను పడింది. ఎలాగైనా అర్జున్ ను చంపేసి ఆ డబ్బును కాజేయాలనుకున్నారు. దీనికోసం ఫ్రెండ్స్ పక్కా ప్లాన్ వేశారు. అయితే బీమా చేయించిన తర్వాత రమేష్ నాసిక్ లో లేడు. దీంతో వీరి ప్లాన్  వర్కౌట్ కాలేదు.

మూడేళ్ల తర్వాత ఇటీవలే రమేష్ నాసిక్ కి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన అతని నలుగురు స్నేహితులు మరో మహిళ సహాయంతో రమేష్ ని హత్య చేశారు. భీమా డబ్బులు రావాలంటే,  తాము దొరకకుండా ఉండాలంటే  అది  అది ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకున్నారు. ప్రమాదవశాత్తు మరణించాడని అందరికీ చెప్పారు. రమేష్ బైక్ మీద వెళ్తుంటే వెనక నుండి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ట్లుగా  చెప్పారు.  పోలీసులు అలాగే కేసు నమోదు చేసుకున్నారు. 

అయితే అంతా బాగానే ప్లాన్ చేశారు కానీ సొమ్ము పంచుకునే విషయంలోనే ఐదుగురు నిందితులు మధ్య గొడవలు వచ్చాయి. ఈ గొడవలతో విసుగు చెందిన వారిలో ఒకరు..  రమేష్ సోదరుడికి అసలు విషయం చెప్పారు. అంతేకాదు... అర్జున్ రమేష్ భలేరావు భార్య రజినీ ఉకే పేరుతో ఓ మహిళ నకిలీ  డాక్యుమెంట్ లను  ఇచ్చి భీమా డబ్బులను మొత్తం తీసుకు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు నుంచి తుపాకీ, 6 తూటాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ముగ్గురు కోసం గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios