Asianet News TeluguAsianet News Telugu

మైనర్ సవతి కూతురి మీద అత్యాచారం.. తండ్రికి 20 యేళ్ల జైలు శిక్ష..కోర్టు తీర్పుకు ఎదురు తిరిగిన బాధితురాలు...

తనపై అత్యాచారం చేసి, గర్భానికి కారణమైన తన సవతి తండ్రికి శిక్ష విధించడాన్ని ఓ అమ్మాయి వ్యతిరేకించింది. అయినా కోర్టు అంతకు ముందు సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని అతనికి 20యేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 

man gets 20 years impresonment for rape of minor stepdaughter though she was hostile
Author
First Published Dec 1, 2022, 9:38 AM IST

ముంబై : 14 ఏళ్ల సవతి కుమార్తెపై పదేపదే అత్యాచారం చేసి గర్భవతిని చేసిన కేసులో 40 ఏళ్ల వ్యక్తిని దోషిగా నిర్ధారించిన పోక్సో ప్రత్యేక కోర్టు మంగళవారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే, ఇక్కడే ఓ ట్విస్ట్ జరిగింది. బాధితురాలు, ఆమె తల్లి కోర్టు విధించిన శిక్షను వ్యతిరేకించారు. ఆ వ్యక్తి తమ కుటుంబంలో సంపాదిస్తున్న ఏకైక సభ్యుడు కాబట్టి శిక్ష నుండి అతడిని తప్పించాలని వారు కోరుతున్నారని కోర్టు పేర్కొంది.

"18 ఏళ్లలోపు బాలికపై సవతి తండ్రి పదే పదే అత్యాచారానికి పాల్పడిన నేరం దారుణం. ఈ కారణంగా బాధిత బాలిక గర్భం దాల్చింది. బాధితురాలి కడుపులోని బిడ్డకు బయోలాజికల్ ఫాదర్ నిందితుడని డీఎన్ఏ రిపోర్టు నిర్ధారించింది..." అని ప్రత్యేక న్యాయమూర్తి అనిస్ ఏజే ఖాన్ అన్నారు. అయితే, ఈ కేసులో బాధితురాలు, ఆమె తల్లి ఈ కేసులో యూటర్న్ తీసుకున్నా కూడా అది తీర్పును ప్రభావితం చేయదని న్యాయమూర్తి అన్నారు. ఈ మేరకుస్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రాంజలి జోషి నిందితుడికి గరిష్ట శిక్షను విధించాలని కోరింది. దీనికి పోలీసులు, వైద్యులతో సహా 10 మంది సాక్షులు చెప్పిన సాక్ష్యాలను ఉదహరించారు.

డిఎన్‌ఎ పరీక్ష అనేది దర్యాప్తు, నిందితుల నేరాన్ని రుజువు చేయడానికి సమర్థవంతమైన సాధనమని, నేటి అభివృద్ధి చెందిన  శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దాని ఖచ్చితత్వాన్ని నిరూపించిందని.. ఈ  కారణంగా దాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోబడిందని కోర్టు పేర్కొంది. 16 వారాల గర్భాన్ని అబార్షన్ చేశారు. 

వీడి దుంపతెగ.. పెళ్లికోసం ఏకంగా ఏటీఎంకే కన్నం వేశాడు.. రూ. 20 లక్షలు దోచుకుని జల్సా చేశాడు.. చివరికి...

బాలిక అసలు తండ్రి మద్యానికి బానిస కావడంతో ఆమె తల్లి అతనికి విడాకులు ిచ్చింది. ఆ తరువాత నిందితుడిని వివాహం చేసుకుంది. వీరికి పెళ్లైన ఐదేళ్లకు ఈ ఘటన జరిగిందని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ ఘటన 2020లో వెలుగులోకి వచ్చింది. 2019లో బాలిక తల్లి స్వగ్రామానికి వెళ్లినప్పుడు సవితి తండ్రి ఈ దారుణానికి ఒడి గట్టాడు. ఆ తరువాత 2020 మార్చిలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. అయితే ఆ సమయంలో ఊరునుంచి వచ్చిన తల్లి పిల్లలను రాత్రి పూట ఎక్కడ పడుకునేవారు అని అడిగితే.. బాధితురాలు తండ్రితో కలిసి మంచం మీద పడుకునేదని, తామిద్దరం కింద పడుకునేవాళ్లం అని మిగతా ఇద్దరు పిల్లలు తెలిపారు. 

బాధితురాలి ప్రకారం... బాధితురాలు, సవతి తండ్రి మంచం మీద పడుకునేవారు. ఆ సమయంలో నిందితుడు తన శరీరంపై చేయి వేసినట్లు బాధిత బాలిక అంగీకరించింది, కానీ ఆమె దానికి ప్రతిఘటించింది.. ఈ మేరకు బాలిక ఇచ్చిన సాక్ష్యం రికార్డులో ఉంది...’’ అని న్యాయమూర్తి నిందితులకు రూ.34,000 జరిమానా విధించారు.

బాలిక పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, మొదటి సంఘటన అక్టోబర్ 2019 లో జరిగిందని తెలిపింది. మార్చి 10, 2020 న, తల్లి తన స్వగ్రామానికి వెళ్లింది, నిందితుడు తనపై మళ్లీ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆరు రోజుల తర్వాత తల్లి తిరిగి వచ్చే వరకు లైంగిక వేధింపులు కొనసాగాయి. తన ఇద్దరు చెల్లెళ్లు నేలపై నిద్రిస్తుండగా, తన మరో సోదరి, తాను నిందితుడితో కలిసి మంచంపై పడుకున్నట్లు బాలిక తన తల్లికి చెప్పింది... అయితే ఇవన్నీ రికార్డు కావడంతో ఇప్పుడు తల్లీ, కూతుళ్లిద్దరూ కేసులో వ్యతిరేకంగా మారినా సాక్ష్యాలు అన్నీ ఉన్నాయని శిక్ష నుంచి తప్పించలేవని న్యాయమూర్తి అన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios