Asianet News TeluguAsianet News Telugu

వీడి దుంపతెగ.. పెళ్లికోసం ఏకంగా ఏటీఎంకే కన్నం వేశాడు.. రూ. 20 లక్షలు దోచుకుని జల్సా చేశాడు.. చివరికి...

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఓ ఏటీఎం సెక్యూరిటీ గార్డు భారీ స్కెచ్ వేశాడు. ఏకంగా ఏటీఎంకే కన్నం వేశాడు. రూ.20 లక్షలు దోచుకున్నాడు. 

ATM guard arrested for stealing rs 20 lakh from atm to marry lover in Bengaluru
Author
First Published Dec 1, 2022, 8:49 AM IST

బెంగళూరు : తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం.. తిన్నఇంటికి కన్నం వేయడం… అనేమాట తరచుగా వింటుంటాం.. అయితే దీన్నే నిజం చేశాడు  ఏటీఎం సెంటర్లో పనిచేసే ఓ ఉద్యోగి. ఆరు నెలల క్రితం బెంగళూరులోని ఓ ఏటీఎం సెంటర్ దగ్గర సెక్యూరిటీ గార్డుగా ఓ యువకుడు ఉద్యోగంలో చేరాడు. అతను అప్పటికే చాలా రోజులుగా ఓ అమ్మాయితో ప్రేమలో వున్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని రెడీ అయ్యాడు. అయితే, పెళ్లి చేసుకోవడానికి డబ్బులు బాగా అవసరం కావడంతో.. తాను పనిచేస్తున్న ఏటీఎం సెంటర్ లోనే దొంగతనం చేయాలని ఫిక్స్ అయ్యాడు. దొరకకుండా ఉండాలని మాస్టర్ స్కెచ్ వేశాడు. 

పక్కా ప్లాన్ ప్రకారం రూ.20 లక్షలు కొట్టేశాడు. ఏటీఎం సెంటర్ లో ఉండే సీసీటీవీ ఫుటేజ్ లో కూడా దొరకకుండా  ఎంచక్కా తప్పించుకున్నాడు. అయితే, ఈ మోజులో పడి సరిగా డ్యూటీకి రాకపోవడంతో అడ్డంగా దొరికిపోయాడు. బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో..  పట్టుబడి జైలుపాలయ్యాడు. బెంగళూరు లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 23యేళ్ల దీపోంకర్ ఆరు నెలల క్రితం ఆ ఉద్యోగంలో చేరాడు. నవంబర్ 17వ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి 8 గంటల మధ్య ఏటీఎం సెంటర్లో రూ. 20 లక్షలు  దోచుకున్నాడు. అలా దోచుకోవడానికి  చాలాకాలం నుంచి స్కెచ్ వేస్తున్నాడు. 

మూడో భర్తను ముక్కలుగా నరికి చంపిన కేసులో ట్విస్ట్... ఇద్దరు భర్తలు ఏమయ్యారు? కూతురు, కోడళ్లకు ఏం జరిగింది?

ఏటీఎం సెంటర్లో డబ్బు లోడ్ చేసే సిబ్బందితో ఫ్రెండ్ షిప్ చేశాడు. వారి డైరీలో రాసుకున్న ఏటీఎం క్యాసెట్ పాస్వర్డ్ను తెలుసుకున్నాడు. అలా చివరికి ఈనెల 17వ తేదీ రాత్రి క్యాసెట్ ఓపెన్ చేసి అందులో ఉన్న 20 లక్షల రూపాయలు దోచుకున్నాడు. ఈ సమయంలో ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీటీవీ కెమెరాకు దొరకకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే, డబ్బు దోచుకున్న తర్వాతి నుంచి డ్యూటీ కి వెళ్లడం మానేసాడు. దీంతో బ్యాంకు మేనేజర్ కు అనుమానం వచ్చింది. డబ్బు దొంగిలించింది  దీపోంకర్ కావచ్చని అనుమానించాడు. వెంటనే ఆయన పోలీసులకు విషయం చెప్పాడు. 

వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఐదు రోజుల పాటు గాలించి దీపోంకర్ ను పట్టుకున్నారు. విచారణలో దీపోంకర్ నిజం అంగీకరించాడు. దోచుకున్న డబ్బులో రూ.5 లక్షలు పెట్టి స్నేహితులకు పార్టీ ఇచ్చినట్లు తెలిపాడు. మిగిలిన 15 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీపోంకర్ ను అరెస్టు చేశారు.  రిమాండ్ కు తరలించారు

Follow Us:
Download App:
  • android
  • ios