హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 100 మందిని నయవంచన చేసిన మోసగాడికి న్యాయస్థానం 110 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ లో చోటు చేసుకుంది. 

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నిందితుడికి జిల్లా కోర్టు 110 ఏళ్ల శిక్ష విధించింది. హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. ఓ వ్యక్తి దాదాపు 100 మందిని నయవంచనకు గురి చేశాడు. ఈ క్రమంలో నిందితుడు ఈ బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. అనంతరం వారికి మధ్యప్రదేశ్ హైకోర్టు పేరుతో అపాయింట్మెంట్ లెటర్లను అందజేశాడు. తీరా ఆ లెటర్లతో విధుల్లో చేరేందుకు వెళ్లగా.. అవి నకిలీవని తేలాయి. 

వివరాల్లోకెళ్తే.. పురుషోత్తం పాసి అనే వ్యక్తి జబల్‌పూర్ హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పించాలని 100 మందికి పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశాడు. వీరికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇప్పిస్తామంటూ నిందితుడు ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేశాడు. తమ అపాయింట్‌మెంట్ లెటర్లతో విధుల్లో చేరేందుకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటన 5 సంవత్సరాల నాటిది. 2018లో 15 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఉద్యోగం ఇప్పిస్తానని పురుషోత్తం అనే వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 100 మంది నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని వారికి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు అందించడాని విచారణలో తేలింది. 

110 ఏళ్ల జైలు శిక్ష 

దీంతో పోలీసులు నిందితుడు పురుషోత్తంను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం కోర్టులో హాజరుపరిచారు. నిందితులపై విచారణ ఎక్కడి నుంచి మొదలైంది. ఫోర్జరీ కేసును జిల్లా కోర్టు నిందితుడికి 110 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జిల్లా,సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అభిషేక్ సక్సేనా పాసి IPCలోని సెక్షన్ 420 ప్రకారం ప్రతి నేరానికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అలాగే ఐపీసీ 467, 471 సెక్షన్ల కింద ఒక్కో కేసులో మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది. శిక్షలు వరుసగా ఉంటాయని, ఒకేసారి ఉండవని కోర్టు పేర్కొంది. అంటే.. నిందితుడు 110 ఏళ్ల జైలులోనే మగ్గాలన్నట్టు.