Asianet News TeluguAsianet News Telugu

వెంబడించి, వేధిస్తున్నాడని.. పోకిరీని చెప్పుతో కొట్టిన కాలేజీ విద్యార్థిని.. వీడియో వైరల్...

శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్తున్న విద్యార్థినిని ఆ వ్యక్తి వెంబడించి, వేధించాడు.. దీంతో ఆమె అతడిని తన చెప్పుతో కొట్టింది. 

Man Follows, Harasses College Student, Beaten With Slippers in  Karnataka - bsb
Author
First Published Jun 10, 2023, 8:36 AM IST

బెంగళూరు : అమ్మాయిలను వెంటబడి వేధించడం.. అల్లరి పెట్టడం.. ప్రేమ పేరుతో అఘాయిత్యాలకు పాల్పడడం తరచుగా కనిపిస్తుంది. ఈ వేధింపులు తట్టుకోలేక చదువులు మానేసేవారు కొందరైతే.. పోలీసులకు ఫిర్యాదు చేసేవారు మరికొందరు.. ఎదిరిస్తే ఏమవుతుందో అనే భయంతో మౌనంగా భరించే వారు ఇంకొందరు. కానీ ఓ విద్యార్థిని అలా ఊరుకోలేదు. తన వెంటబడి వేధించిన వాడిని నలుగురిలో చెప్పుతో కొట్టింది.

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్తున్న బాలికను ఆ వ్యక్తి వెంబడించి, వేధించాడం మొదలు పెట్టాడు. దీంతో ఆ బాలిక గట్టిగా కేకలు వేసి స్థానికులను అప్రమత్తం చేసింది. 

టెన్త్ లో 35% శాతం మార్కులతో పాసైన కొడుకు.. సంబరాలు చేసుకున్న తల్లిదండ్రులు.. వీడియో వైరల్..

వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని పట్టుకున్నారు. ఆ తరువాత బాలిక ఆ వ్యక్తి ముఖంపై బహిరంగంగా చెప్పుతో కొట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఈ వీడియోలో, అమ్మాయి అతని తలపై, ముఖంపై తన కాలి చెప్పులతో కొడుతుండడం..  తనను విడిచిపెట్టమని ఆ వ్యక్తి స్థానికులను అభ్యర్థిస్తుండడం కనిపిస్తుంది. 

అమ్మాయి కొడుతుంటే ప్రతిగా ఏమీ చేయకుండా.. దెబ్బలు తిన్నాడు. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్తున్న బాలికను ఆ వ్యక్తి వెంబడించి వేధించాడని స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత అతడిని పోలీసులకు అప్పగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios