మానసిక స్థితి బాగోలేని వ్యక్తిని పాము కాటుతో చంపేశారు.. ఇన్సురెన్స్ డబ్బుల కోసం ఇంత నీచమా..?
ఓ వ్యక్తి తన స్వార్ధం కోసం మానసిక స్థితి లేని మరో వ్యక్తిని దారుణంగా చంపేశాడు. బీమా డబ్బులను పొందేందుకు (claim insurance money) మరో కొందరితో కలిసి ఈ హత్య చేశాడు.
ఓ వ్యక్తి తన స్వార్ధం కోసం మానసిక స్థితి లేని మరో వ్యక్తిని దారుణంగా చంపేశాడు. బీమా డబ్బులను పొందేందుకు (claim insurance money) మరో కొందరితో కలిసి ఈ హత్య చేశాడు. అనంతరం చనిపోయింది తానేనంటూ పత్రాలు సృష్టించాడు. అయితే బీమా కంపెనీకి అనుమానం రావడంతో అతని అసలు కథ వెలుగుచూసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని Ahmednagar district అకోల్ తహసీల్ పరిధిలోని రాజూర్ గ్రామంలో చోటుచేసకుంది. ఇందుకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు అతనికి సాయం చేసిన మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రభాకర్ వాఘ్‌చౌరే అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా అమెరికాలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడు అమెరికాలోని ఓ సంస్థ నుంచి 5 మిలియన్ డాలర్ల(రూ. 37.5 కోట్లు) విలువైన బీమా తీసుకున్నాడు. అయితే ప్రభాకర్ 2021లో జనవరిలో ఇండియాకు వచ్చాడు. అహ్మద్‌నగర్ జిల్లాలోని Dhamangaon Pat అనే గ్రామంలో తన అత్తమామల వద్ద నివసించేవాడు.
అయితే ఇన్సురెన్స్ డబ్బులు దక్కించుకోవడానికి తప్పుడు పత్రాలు సృష్టించాలని ప్రభాకర్ భావించాడు. ఈ క్రమంలోనే మానసిక స్థితి బాగోలేని ఓ వ్యక్తిని చంపడానికి ప్లాన్ వేశాడు. ఇందుకోసం సందీప్ తలేకర్, హర్షద్ లహమగే, హరీష్ కులా్, ప్రశాంత్ చౌదరిల సాయం తీసుకున్నాడు. వారికి డబ్బులు ఇస్తానని మాట ఇచ్చాడు. తర్వాత ప్రభాకర్ రాజూర్ గ్రామానికి మకాం మార్చాడు. అక్కడ ఓ అద్దె ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు. ప్రభాకర్ మిగిలిన నలుగురితో కలిసి విషపూరిత పామును సేకరించాడు. మానసికి స్థితి బాగోలేని వ్యక్తిని పాము కాటేసేలా (snakebite) చేశారు.
అతడు చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు తమను తాము ప్రభాకర్ బంధువులుగా చెప్పుకున్నారు. మృతుడి పేరును ప్రభాకర్ వాఘ్‌చౌరేగా నమోదు చేయించారు. బాధితుడు అమెరికాలో ఉండేవాడని.. కొద్ది నెలల క్రితం ఇండియాకు వచ్చాడని అధికారులకు తెలిపారు. ఆ తర్వాత మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు, ఇన్సురెన్స్ క్లెయిమ్ చేయడానికి అవసరమైన చట్టపరమైన పత్రాలను కూడా సేకరించారు. తర్వాత చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అనంతరం వాటిని అమెరికాలోని ప్రభాకర్ కొడుకుకు పంపడంతో అతడు బీమా డబ్బులు కోసం దరఖాస్తు చేశాడు.
Also read: పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేత: బీఎస్ఎఫ్ జవాన్ ను అరెస్ట్ చేసిన ఏటీఎస్
గతంలో ప్రభాకర్ తమను మోసం చేసేందుకు యత్నించిన విషయాన్ని గుర్తుచేసుకన్న అమెరికన్ సంస్థ.. ఇన్సురెన్స్ క్లెయిమ్ విషయంలో అనుమానపడింది. క్లెయిమ్‌కు సంబంధించి ధ్రువీకరణ కోసం తమ టీమ్‌ను ఇండియాకు పంపింది. దీంతో ఇండియా చేరుకున్న వారు పోలీసులను సంప్రదించారు. దీంతో విచారణ జరపగా ప్రభాకర్ కుట్ర మొత్తం బయటపడింది.
దీంతో పోలీసులు ప్రభాకర్ కోసం గాలింపు చేపట్టారు. చివరకు గుజరాత్‌లో వడోదరాలో అతడిని అరెస్ట్ చేశారు. అతనితో పాటు మిగిలిన నలుగురు నిందితులపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.