ప్రస్తుత పరిస్ధితుల్లో ఎదుటి మనిషి తుమ్మినా, దగ్గినా అతని వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహించరు. అంతేనా అతనిని ఓ అంటరానివాడిలా చూస్తుంది సమాజం. ఇక ఎవరికైనా కరోనా సోకినట్లు తెలిస్తే ఆ ఇంటి చాయలకు కూడా ఎవరూ వెళ్లరు. వైరస్ సోకి మరణిస్తే.. ఆ మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకురావద్దని, ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించొద్దని కొన్ని వూళ్లు తేగెసి చెబుతున్నాయి.

అధికారులైనా సరే వారి మాటను వినాల్సింది. ఇలాంటి పరిస్దితుల్లో ఓ వ్యక్తి ఏకంగా కరోనా సోకి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని పీక్కుతిన్నాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని ఓ శ్మశానవాటికలో జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. సతారా జిల్లాలోని ఫల్టాన్​ మున్సిపల్​ పరిధిలోని ఓ శ్మశాన వాటికలో కరోనా మృతదేహాలకు దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సగం కాలిన కరోనా మృతదేహాల అవయవాలను ఓ వ్యక్తి పీక్కు తింటున్నట్లు స్థానికులు గుర్తించారు.

Also Read:అంబులెన్స్ లో ఆక్సీజన్ సిలిండర్ ఖాళీ.. దాచిపెట్టి కోవిడ్ పేషంట్ ను ఎక్కించుకున్న డ్రైవర్.. చివరికి... !

సమాచారం అందుకున్న ఫల్టాన్​ మున్సిపల్​ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే వారు వచ్చేలోగా సదరు వ్యక్తి పరారయ్యాడు. కానీ సాయంత్రానికల్లా తీవ్రంగా గాలించి అతడిని వెతికి పట్టుకోగలిగారు.

అతనికి మతిస్థిమితం సరిగా లేదని అధికారులు గుర్తించి, మానసిక వైద్యుడి వద్దకు చికిత్స కోసం తరలించినట్లు పేర్కొన్నారు.  వైద్య నివేదికలు వచ్చిన అనంతరం దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  కాగా, అతను శవాన్ని పీక్కుతింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.