ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మహిళను హోటల్ గదిలో బంధించి, అత్యాచారయత్నం చేసిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఈ ఘటన హర్యానాలో జరిగింది.
గురుగ్రామ్ : హర్యానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి ఓ యువతిని హోటల్ గదిలో బంధించారు ఇద్దరు వ్యక్తులు. అందులో ఒకరు ఆమె మీద అత్యాచారయత్నం కూడా చేశారు. చివరికి బలవంతంగా ఆమెను మరోచోటికి తరలించే ప్రయత్నంలో పోలీసులు దొరికిపోయారు. వివరాల్లోకి వెడితే...
22 ఏళ్ల ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు గురుగ్రామ్‌లోని ఓ హోటల్ గదిలో బంధించారు. వారిలో ఒకరు ఆమెను కొట్టి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళకు ఉద్యోగం లేదు. ఆమె ఉద్యోగాన్వేషణలో ఉంది. ఆమెకు తెలిసిన వ్యక్తులను తనకు ఏదైనా ఉద్యోగం చూపించాలని సాయం అడిగింది. దీంతో నిందితుల్లో ఒకరు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెకు ఆశ చూపించాడు. దీనికోసం తనతో సెక్టార్ 46కి రమ్మన్నారు. అక్కడ ఓ హోటల్ గదికి రమ్మని చెప్పి పిలిచారు.
వారి మాటలు నమ్మి వచ్చిన యువతిని హోటల్ గదిలోకి తీసుకువెళ్లిన తరువాత.. అక్కడే ఆమెను రెండు రోజులు బంధించి ఉంచారు. అంతేకాదు ఆమె మీద నిందితుల్లో ఒకరు ఆమెపై అత్యాచారం చేసేందుకు కూడా ప్రయత్నించారని ఆమె పోలీసులకు తెలిపారు. మంగళవారం రాత్రి, ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన ఇద్దరు నిందితులు ఆమెను తమ కారులోకి ఎక్కించుకుని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించారు.
స్నేహితుడిని చంపేసి.. చచ్చిన పామును పక్కనవేసి...
అయితే, బైటికి వెళ్లే గేటు దగ్గర వారికి పోలీస్ వ్యాన్ కనిపించింది. దీంతో నిందితులు ఇద్దరు భయాందోళనకు గురై కారును, మహిళను వదిలి పారిపోయారు. ఇది గమనించిన పోలీసులు కారులోని మహిళను విచారించగా అసలు విషయం బయట పడింది. దీంతో విచారణ ప్రారంభంచిన పోలీసులు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 323 (బాధ కలిగించడం), 342 (తప్పుగా నిర్బంధించడం), 354-బి (లైంగిక దాడి), 376/511 (అత్యాచారం ప్రయత్నం), 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. పోలీసులుల తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోలోని ఓ హోటల్ లో 21 యేళ్ల యువతి పనిచేస్తోంది. ఈ క్రమంలో హోటల్లో పనిచేసే ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతను ఆమెతో పరిచయాన్ని పెంచుకున్నాడు. తన బంధువు కూడా హోటల్ మేనేజ్మెంట్ లో పనిచేస్తుందని తెలిపాడు. మంగళవారం హోటల్లో పనులు ముగించుకుని బాధితురాలు ఇంటికి వెళుతున్న సమయంలో.. నిందితుడు ఆమెను కారులో డ్రాప్ చేస్తానని నమ్మబలికాడు. దీంతో అతడి మాటలు నమ్మిన ఆమె కారు ఎక్కింది. ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తరువాత అతడు యువతితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
దీంతో, బాధితురాలు కారు ఆపాలని ఎంతగా కోరినా ఆపలేదు. దీంతో జనేశ్వర్ మిశ్రా పార్కు వద్ద కదులుతున్న ఎస్వీయూ కారులో నుంచి ఆమె కిందికి దూకేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాధితురాలి వద్దకు వెళ్లి ఆమె స్టేట్ మెంట్ తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. చివరికి నిందితుడిని అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నామని కారును సీజ్ చేసినట్లు ఏఎస్పీ శ్రీవాత్సవ పేర్కొన్నారు.
