Asianet News TeluguAsianet News Telugu

ఆటోతో బైక్ ను ఢీ కొట్టి, 1.5కి.మీ. లు ఈడ్చుకెళ్లిన ఆటోడ్రైవర్... బైకర్ పరిస్థితి విషమం..

బైకర్ ను ఢీ కొట్టిన ఓ ఆటో డ్రైవర్.. అతడు ఆటో కింద చిక్కుకున్న విషయం తెలిసినా అలాగే ఆటోను నడిపించాడు. కిలోమీటరున్నర దూరం వెళ్లిన తరువాత అతడిని రోడ్డుపక్కన పడేసి వెళ్లాడు. 

man dragged 1.5 km by auto driver in Bihar - bsb
Author
First Published Jan 19, 2023, 2:18 PM IST

బీహార్ : బీహార్ లోని సహర్సా జిల్లాలో ఢిల్లీ తరహా ఘటన వెలుగు చూసింది. నూతన సంవత్సర వేళ స్కూటీని కారు తో ఢీ కొట్టి ఓ యువతిని 17 కిలోమీటర్లు ఈడ్చికు వెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.  అలాంటి ఘటనే తాజాగా బీహార్లో చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ బైక్ మీద వెళుతున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టాడు. ఆ తర్వాత అతడిని 1.5 కి.మీ.ఈడ్చుకెళ్లాడు. ఆటోను ఆపమని అతడు ఎంతగా కేకలుపెట్టినా పట్టించుకోలేదు.  అలాగే ఆటోను వేగంగా నడిపించాడు. 

కిలోమీటరున్నర దూరం వెళ్ళిన తర్వాత ఆటోను ఒకచోట ఆపాడు.  అప్పటివరకు ఈడ్చికొచ్చిన భయం రోడ్డు పక్కకు విసిరేసి పారిపోయాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన అతనిని స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బైకర్ పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అతని కుడికాలు తీవ్రంగా దెబ్బతింది. చికిత్స పనిచేయకపోతే కాలును పూర్తిగా తొలగించాల్సి ఉంటుందని డాక్టర్లు పేర్కొన్నారు.

గన్ చూపించిన వెనక్కి తగ్గకుండా పోరు.. బ్యాంక్ దొంగలను తరిమికొట్టిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్.. వీడియో వైరల్

ఆటో దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని కోమల్ కిశోర్ సింగ్ (25)గా పోలీసులు గుర్తించారు. అతడి స్వగ్రామం హేంపూర్. మంగళవారం తన స్వగ్రామానికి వెళుతుండగా బిహ్రా బ్రహాం ఆస్థాన్ దగ్గర అతడిని ఒక ఆటో ఢీ కొట్టింది. దీంతో అతడు ఆటో కింద ఇరుక్కుపోయాడు. అయితే ఆటోను ఆపి అతని బయటికి తీయాల్సిన ఆటో డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకోవాలని.. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆటో కింద ఇరుక్కుపోయిన వ్యక్తిని బయటికి తీయకుండానే వాహనాన్ని అలాగే ముందుకు దూకించాడు. 1.5 కిలోమీటర్లు దూరం అలాగే కిషోర్ ను ఈడ్చుకు వెళ్ళాడు.  

అది గమనించిన స్థానికులు గట్టిగా కేకలు పెడుతూ ఆపడానికి ప్రయత్నించినా.. అతను ఆపలేదు. 1.5 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఆటోను ఆపి కిషోర్ ను పక్కన రోడ్డు మీద పడేసి పారిపోయాడు.  సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటన మీద కేసు నమోదు చేశారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆటో డ్రైవర్ కోసం వెతుకుతున్నారు. 
 
ఇదిలా ఉండగా, బెంగళూరులో మంగళవారం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువకుడు బండి నడుపుకుంటూ రాంగ్ రూట్లో వచ్చాడు. ఇంకేముంది ఇంకో వాహనాన్ని ఢీకొట్టాడు. తప్పు తనదని తెలుసు కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో అమానుషంగా వ్యవహరించాడు. బెంగళూరులోని మాగడి రోడ్డు టోలుగేటు వద్దకు టూవీలర్ పై ఓ యువకుడు వచ్చాడు. అతడి పేరు సోహైల్ (25). వేగంగా వచ్చి ఓ జీపును ఢీకొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనానికి, జీపుకు డ్యామేజ్ అయింది. జీపు డ్రైవర్ ముత్తప్ప శివ శంకరప్ప (71) ఒక కుదుపుకు కంగారుపడ్డాడు. 

ఆ జీపు దిగి,స్థానికుల సహాయంతో యువకుడిని పట్టుకున్నారు. దెబ్బతిన్న జీపుకు రిపేర్ చేయించాలని అడిగాడు. లేదంటే రిపేరుకు అయ్యే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, సదరు నిందితుడు మాత్రం తన టు వీలర్ కూడా దెబ్బతిన్నది అని, అయినా తను ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నించాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత  అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే యువకుడు పారిపోకుండా పట్టుకునే ప్రయత్నంలో జీపు డ్రైవర్ ముత్తప్ప బైక్ ను గట్టిగా  పట్టుకున్నాడు. 

నిందితుడు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా అలాగే ముత్తపతో సహా బైక్ ను ముందుకు దూకించాడు. బైక్ ను ఆపకుండా.. కిలోమీటర్ దూరం వరకు ముత్తప్పను అలాగే ఈడ్చుకువెళ్ళాడు. రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు ఇది గమనించారు. వెంటనే టు వీలర్ ను ఆపి.. ముత్తపను కాపాడారు. ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి యువకుడిని పట్టించారు.

Follow Us:
Download App:
  • android
  • ios